Gold And Silver Effective Rates Today 08-04-2024 : ఈ రోజు బంగారం ధరలు ఆదివారం ధరల మీద స్వల్పంగా తగ్గాయి. దేశంలో 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ. 10 తగ్గి, రూ. 65,340 వద్దకు చేరింది. ఆదివారం నాడు ఈ ధర రూ. 65,350గా ఉంది. ఇక 100 గ్రాముల 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.100 క్రిందకు దిగి రూ. 6,53,400గా నమోదయింది. ప్రస్తుతం 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,534గా ఉంది.
ఇదిలావుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.10 క్రిందికి దిగి రూ. 71,280 వద్ద కొనసాగుతోంది. ఆదివారం రోజు ఇదే 24 క్యారట్ల బంగారం ధర రూ. 71,290గా ఉన్నది. మరోవైపు 24 క్యారట్ల గోల్డ్ 100 గ్రాముల ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,12,800గా కొనసాగుతోంది. అయితే 1 గ్రామ్ బంగారం ధర రూ. 7,128గా ఉంది.
Today Gold Rate In Telugu States :
హైదరాబాద్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,340గా పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 71,280గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లు గోల్డ్ రేటు రూ.65,340. 24 క్యారెట్ల బంగారం వచ్చేసి రూ.71,280గా కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.65,340 మరియు 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.71,280 గా నమోదయ్యాయి.
ఇక దేశంలోని ముఖ్య నగరాలలో పసిడి ధరలు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 65,490గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,430గా నమోదు అయింది. కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 65,340 గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 71,280గా పలుకుతోంది. ముంబై, పుణె, కేరళలో కూడా బంగారం రేట్లు ఇవే కొనసాగుతున్నాయి.
మరో వైపు చెన్నైలో 22క్యారెట్ల పుత్తడి ధర వచ్చేసి రూ. 66,140గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,150గా పలుకుతోంది. ఇక బెంగళూరు విషయానికి వస్తే 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ. 65,340 పలికింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,280గా కొనసాగుతుంది.
అహ్మదాబాద్లో 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 65,390గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,330గా పలుకుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,340గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు వచ్చేసి రూ. 71,280గా కొనసాగుతున్నది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరలు పెరగడం, తగ్గడానికి కారణమవుతున్నాయని విపణి మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు
దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా దిగివచ్చాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి రేటు రూ. 8,340గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 క్రిందకు తగ్గి రూ. 83,400గా నమోదయింది. ఆదివారం కిలో వెండి రేటు రూ 83,500గా ఉంది.