Gold Rates Interest Rates: చాలా మంది బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు పొందేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రజలు వైద్య ఖర్చులకు, విద్య (Education) లేదా ఉద్యోగ అవసరాల కోసం చాలా డబ్బు అవసరమైనప్పుడు రుణాలు తీసుకుంటారు. ఇతర రుణాలతో పోలిస్తే బంగారం లోన్ పై తక్కువ వడ్డీ రేట్లు కలిగి ఉంటుంది. ఇతర పర్సనల్ రుణాల (Personal Loan) లో తాకట్టు పెట్టరు కాబట్టి, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి.కానీ, బంగారాన్ని తాకట్టు పెడతాం కాబట్టి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు పొందవచ్చు. ఇక్కడ లోన్ పొందడానికి క్రెడిట్ స్కోర్ (Credit Score) కూడా అవసరం లేదు. ఈ వడ్డీ రేట్లు బ్యాంకు మరియు లోన్ బట్టి మారుతాయి.
బంగారం విలువపై 65% నుండి 75% వరకు డబ్బును రుణంగా తీసుకోవచ్చు. రుణం పొందడానికి ప్రాసెస్సింగ్ ఫీజులు మరియు ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. చాలా బ్యాంకుల్లో 0.50% నుండి 1% వరకు హ్యాండ్లింగ్ ఫీజులు ఉంటాయి. గోల్డ్ లోన్ పొందడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. అలాగే పేపర్ వర్క్ కూడా ఏమి ఉండదు. అయితే, వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వివిధ బ్యాంకుల్లో బంగారం రుణాలపై కొత్త వడ్డీ రేట్లు
ఎస్బీఐ గోల్డ్ లోన్ (SBI Gold Loan) వడ్డీ రేట్లు :
EMI రూపంలో గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేట్లు : 9.90%
3 నెలల బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ రేటు : 8.75%
6 నెలల బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ కోసం వడ్డీ రేటు : 8.90%.
12 నెలల బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ రేటు : 9.15%
Also Read:Mudra Loan For New Business : వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఈ పథకం ద్వారా ఏకంగా రూ.10 లక్షలు లోన్
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు
రిటైల్ గోల్డ్ లోన్ వడ్డీ రేటు : 9.15%
డిమాండ్ రుణంపై వడ్డీ రేటు : 9.40%
EMI ఆధారంగా వడ్డీ రేటు : 9.40%
ఓవర్‌డ్రాఫ్ట్ ఆధారంగా వడ్డీ రేటు : 9.40%.
HDFC బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు
ఈ బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 9.00% గరిష్టంగా 17.65% వరకు ఉంటాయి. సగటు వడ్డీ రేటు 11.98% ఉంది.
ICICI బ్యాంక్ గోల్డ్ లోన్ (Gold Loan) వడ్డీ రేట్లు :
గోల్డ్ లోన్‌ల పై, ICICI బ్యాంక్ కనిష్టంగా 9.00% మరియు గరిష్టంగా 18.00% వరకు ఉంటాయి. సగటున, వడ్డీ రేట్లు 14.65% ఉంది.
యాక్సిస్ బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు :
యాక్సిస్ బ్యాంక్ గోల్డ్ రుణాలను 9.30% తక్కువ వడ్డీ రేట్లు మరియు 17.0% వరకు అందిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు
బంగారు ఆభరణాలపై రుణం తీసుకోవడానికి వడ్డీ రేటు : 9.25% .
సావరిన్ గోల్డ్ బాండ్ల నుండి రుణం తీసుకోవడానికి వడ్డీ రేటు : 9.25%.