Gold Rates Today 02-03-2024 : బాబోయ్ బంగారం ధరలు భారీగా పెంపు, తులం బంగారం ఎంతంటే?

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,900 వద్ద నమోదయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.64,240 వద్ద నమోదయింది.

Gold Rates Today 02-03-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? ఈ మధ్య బంగారం రేట్లపై హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధర ఏకంగా రూ.930 పెరిగింది.

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,900 వద్ద నమోదయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.64,240 వద్ద నమోదయింది. వెండి ధరపై పెరుగుదల చోటు చేసుకుంది. కిలో వెండిపై రూ.500 వరకు పెరిగింది.

దేశ ప్రధాన నగరాల్లో Gold Rates Today 02-03-2024 ధరలు ఇలా ఉన్నాయి.

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57, 900 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,240 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 58,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,090గా నమోదయింది. చెన్నై లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,400, 24 క్యారట్ల బంగారం ధర రూ.63,720 వద్ద నమోదయింది.

 

Gold Rates Today 02-03-2024 : Baboy gold prices increased heavily, how much is Tulam gold?

పెరిగిన వెండి ధరలు : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర  రూ.77,000 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,000 వద్ద నమోదయింది. చెన్నై లో బంగారం ధర రూ.77,000 వద్ద నమోదయింది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,150 వద్ద నమోదయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర పెరిగింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,750 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 64,090గా నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Comments are closed.