Gold Rates Today 03-04-2024 : వామ్మో..! తులం బంగారం ఇంతనా! తెలుగు రాష్ట్రాల్లో ధర తెలిస్తే షాక్ అవుతారు
ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750 పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.760 పెరుగుదల చోటుచేసుకుంది.
Gold Rates Today 03-04-2024 : బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. పెరుగుతున్న బంగారం ధరలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు బంగారం కొనాలనుకున్న కూడా రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగాయి కాబట్టి దేశీయంగా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హమ్మయ్య అనుకునేలోపే మళ్ళీ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి? తులం గోల్డ్ పై ఎంత తగ్గింది అనే విషయం గురించి తెలుసుకుందాం.
ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750 పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.760 పెరుగుదల చోటుచేసుకుంది. ఇటు వెండి విషయానికి వస్తే, వెండి కూడా భారీగానే పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..!
- తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర భారీగా పెరిగింది.
- ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,100 వద్ద నమోదయింది.
- ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,870 వద్ద నమోదయింది.
దేశ నగరాల్లో ధరలు ఇలా..!
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,250 వద్ద నమోదుకాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,020 వద్ద కొనసాగుతుంది.
- ముంబైలో గోల్డ్ ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,100 వద్ద నమోదుకాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,870 వద్ద నమోదయింది.
- కోల్కతా, బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,100 వద్ద నమోదుకాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,870 వద్ద నమోదయింది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,000 వద్ద నమోదుకాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,190 వద్ద నమోదయింది.
వెండి ధరలు నేడు ఇలా..!
వెండి ధర దేశ వ్యాప్తంగా పెరిగింది. దేశ ప్రధాన నగరాల్లో మరియు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
- తెలంగాణలోని హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.81,000 వరకు చేరుకుంది.
- విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 81,000 వద్ద నమోదయింది.
- దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.81,000 మార్కును చేరుకుంది.
- కోల్కతా లో కిలో వెండి ధర రూ.81,000 వద్ద నమోదయింది.
- బెంగుళూరులో కిలో వెండి ధర రూ.79,000 నమోదయింది.
- చెన్నైలో కిలో వెండి ధర రూ. 84,000 నమోదయింది.
Comments are closed.