Gold Rates Today 05-03-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? ఈ మధ్య బంగారం రేట్లపై హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గత రెండు రోజులుగా బంగారం ధర భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈరోజు బంగారం కొనుగోలు చేసే వారికీ కాస్త ఊరట అనే చెప్పాలి. నేడు బంగారం ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి.
ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,740 వద్ద నమోదయింది. కిలో వెండిపై రూ.100 తగ్గుదల చోటుచేసుకుంది.
దేశ ప్రధాన నగరాల్లో Gold Rates Today 05-03-2024 ధరలు ఇలా ఉన్నాయి.
మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58, 890 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,230 వద్ద నమోదయింది.
దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 58,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,080గా నమోదయింది. చెన్నై లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,290, 24 క్యారట్ల బంగారం ధర రూ.64,680 వద్ద నమోదయింది.
వెండి ధరలు ఇలా :
దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర రూ.76,900 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.73,500 వద్ద నమోదయింది. చెన్నై లో బంగారం ధర రూ.76,900 వద్ద నమోదయింది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,650 వద్ద నమోదయింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర కొద్దిగా తగ్గింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,740 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 64,080గా నమోదయింది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.
Also Read : Gold Rates Today 04-03-2024 : బంగారం ధరలు నేడు స్థిరంగా, తులం బంగారం ధర ఎంతంటే