Gold Rates Today 10-02-2024: బంగారం కొనుగోలు చేయాలా? పసిడి,వెండి ధరలు నేడు ఇలా
ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 వరకు తగ్గగా, నేడు బంగారం ధర రూ.57,890 నమోదు కాగా, 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,150 వద్ద నమోదయింది.
Gold Rates Today 10-02-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే బంగారం కొనాలనుకునే వారు ఈ నెలలో బంగారం కొనుగోలు చేసుకోవడం మంచిది. ఎందుకంటే వచ్చే రెండు నెలల్లో పెళ్లిళ్ల ముహుర్తాలు రాబోతున్నాయి. కాబట్టి బంగారం రేట్ పెరుగుతుంది. ఈ మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వచ్చి నిన్న కొంచం ధర తగ్గుముఖం పట్టింది. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు బంగారం ధర తగ్గింది.
ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 వరకు తగ్గగా, నేడు బంగారం ధర రూ.57,890 నమోదు కాగా, 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,150 వద్ద నమోదయింది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై రూ.100 వరకు పెరిగింది. కిలో వెండి ధర రూ.75,100 వద్ద కొనసాగుతుంది.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…
మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58, 040 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,300 వద్ద నమోదయింది.
దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,890 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,150గా నమోదయింది.
చెన్నై లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,380, 22 క్యారట్ల బంగారం ధర రూ.63, 700 వద్ద నమోదయింది.
వెండి ధరలు ఇలా :
దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు పెరిగింది. కిలో వెండిపై రూ.100 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర రూ.76,600 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,100 వద్ద నమోదయింది, బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.72,600 వద్ద కొనసాగుతుంది.
Gold Rates Today 09-02-2024 In Telugu States
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,890 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 63,150గా నమోదయింది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.
Comments are closed.