Gold Rates Today 21-02-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? ఇక పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం రేట్లు కూడా పెరిగుతున్నాయి. నిన్న బంగారం ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి కానీ ఈరోజు మాత్రం ధరలు పెరిగాయి.
ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.250 పెరిగి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 వరకు పెరిగింది. ఇక కిలో వెండిపై రూ.200 పెరిగింది.
దేశ ప్రధాన నగరాల్లో Gold Rates Today 21-02-2024 ధరలు ఇలా ఉన్నాయి.
మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57, 750 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,890 వద్ద నమోదయింది.
దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,740గా నమోదయింది.
చెన్నై లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,100, 24 క్యారట్ల బంగారం ధర రూ.63,380 వద్ద నమోదయింది.
వెండి ధరలు ఇలా :
దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర రూ.77,200 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,700 వద్ద నమోదయింది. చెన్నై లో బంగారం ధర రూ.77,200 వద్ద నమోదయింది. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,750 వద్ద నమోదయింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర పెరిగింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,600 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,740గా నమోదయింది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.