Telugu Mirror : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఈరోజు శుభవార్త. వరుసగా రెండో రోజు కూడా భారీగా ధరలు తగ్గాయి. అయితే, ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం…22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 350 తగ్గగా, 24 క్యారట్ల బంగారం పై రూ.380 తగ్గింది. సుమారు రూ.500 వరకు బంగారం పై ఈ రెండు రోజుల్లో తగ్గింది.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…
మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 850 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,100 వద్ద నమోదయింది.
దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950 నమోదయింది.
ఇక చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 400 తగ్గగా, అక్కడి బంగారం ధర రూ. 58,100గా నమోదయింది. మరి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.440 తగ్గగా చెన్నై లో రూ. 63,380గా నమోదయింది.
Also Read : Tata Punch EV : రూ.10.99 నుంచి రూ.14.49 లక్షల ధరలలో విడుదల అయిన టాటా పంచ్ EV; వివరాలు తెలుసుకోండి
తగ్గిన వెండి ధరలు :
వెండి ధర కూడా దేశంలో పలు ప్రధాన నగరాల్లో తగ్గుముఖం పట్టింది. కిలో వెండి పై రూ.600 వరకు తగ్గింది. రెండు రోజుల్లో వరుసగా రూ.900 తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో అనగా హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర రూ. 77,440గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, చెన్నై లో కిలో వెండి ధర రూ. 77,440 ఉండగా, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,900 ఉండగా, బెంగుళూరులో రూ. 73, 700 గా నమోదయింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,700 నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,950 గా నమోదయింది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.