Telugu Mirror : సీనియర్ సిటిజన్ లకు సురక్షితమైన రాబడిని అందించడానికి భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పధకాన్ని 2004 వ సంవత్సరం లో ప్రారంభించింది.ఈ పథకం ప్రభుత్వ పథకం కాబట్టి రిస్క్ లేని పెట్టుబడులను అందిస్తుంది.ఈ స్కీమ్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవాలంటే ఒక వ్యక్తి 60 లేదా అంత కంటే ఎక్కువ వయస్సును కలిగిన వారు, పదవి విరమణ పొందిన వారు, 55 లేదా అంతకంటే ఎక్కువ వయసు గల వారు మరియు దేశ భద్రతలో పని చేసి రిటైర్డ్ అయివుంటే 50 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నవారు అర్హులు.
ToDay Panchang : నేటి పంచాంగం జూలై 5, 2023. వివరాలు ఇవే..
SCSS ఖాతాను ఓపెన్ చేయ్యాలంటే ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకు ద్వారా ఖాతాను తెరవచ్చు.పూర్తిగా నింపిన ధరకాస్తు నమూనతో పాటు KYC గుర్తింపు కోసం చిరునామా పత్రాలు మరియు రెండు ఫోటోలను అందించాలి.లక్ష రూపాయల లోపు డిపాజిట్ చెయ్యాలనుకుంటే నగదు రూపంలో చెల్లించాలి, లక్ష కంటే ఎక్కువ డిపాజిట్ చెయ్యాలనుకుంటే చెక్కు లేదా డీ.డీ. రూపంలో చెల్లించాలి.ఖాతాను తెరిచిన వారు కనీసం రూ.1000 తో పెట్టుబడి ప్రారంభించాల్సి ఉంటుంది.పెట్టుబడిని రూ.15 లక్షల వరకు పెట్టవచ్చు.ప్రస్తుతం వార్షికంగా 7.40 శాతం వడ్డీ లభిస్తుంది.
ఖాతాను తెరిచిన దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు ఈ పథకం వాలిడ్ ఆ తరువాత కావాలనుకుంటే మళ్ళీ 3 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు.అయితే ఒకరి పేరు పై ఎన్ని ఖాతాలనైనా ప్రారంభించ వచ్చు. కానీ అన్ని ఖాతాలలో కలిపి రూ.15 లక్షల కంటే మించకూడదు.అలానే మన ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు లేదా బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు.ఖాతా ప్రారంభించిన ఏడాదికే ఖాతాను మూసివేయాలని అనుకుంటే డిపాజిట్ మొత్తంపై 1.50 శాతం, రెండేళ్ళ తరువాత మూసివేయాలని అనుకుంటే 1 శాతం కోతలు విధించి మిగతా సొమ్మును అందిస్తారు.
Women Loan Scheme : మహిళల కోసం అద్భుత రుణ పథకం..దళిత మహిళ లకు వడ్డీ లేకుండా రుణం
అలాగే వడ్డీ ఆదాయం రూ.50 వేలకు మించితే టీడీఎస్ కట్ చేస్తారు.కాలపరిమితి తీరక ముందే వ్యక్తిగత ఖాతా దారుడు చనిపోతే పెట్టుబడి సొమ్ము, మొత్తం వడ్డీని కలిపి వారసులకు అందజేస్తారు.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పెద్దలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ పథకం ద్వారా ఎక్కువ వడ్డీని పొందవచ్చు.కాబట్టి అర్హత ఉన్నవారు ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఖాతాను తెరవండి.