Telugu Mirror : నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో పోలీసు శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. 15 వేల పోలీసు ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. ఇదే సమయంలో వయోపరిమితి దాటిపోతున్నదని బాధపడుతున్న గ్రూపు 1 నిరుద్యోగులకు కూడా స్వీట్ న్యూస్ చెప్పారు. వయోపరిమితి వయస్సు 46 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే గ్రూపు 1 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు.
ఇటీవల నెక్లెస్ రోడ్డు (Necklace Road) లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన సింగరేణి ఉద్యోగ మేళాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం 441 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగదని, 2లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అభ్యర్థులు పరీక్షల తేదీల గురించి ఆలోచించకుండా సన్నద్ధం కావాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు.
Also Read : AP TET 2024 : నేడు ఏపీ టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది.. పూర్తి వివరాలు ఇవే
రాష్ట్రంలో ప్రభుత్వం మారడటంతో ఉద్యోగాల పై కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల (Coaching Center)కు క్యూ కడుతున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లకు భారీ డిమాండ్ పెరిగింది. భారీగా కోచింగ్ ఫీజు వసూల్ చేస్తున్నారు. అంతేకాకుండా హాస్టల్స్ లో ఫీజు కూడా గతం కంటే పెరిగిందని నిరుద్యోగులు అంటున్నారు.
ఇదే సమయంలో కోచింగ్ సెంటర్ల పరిసరాల్లో నిరుద్యోగులు అద్దెకలకు దిగారు. దీంతో ఆ పరిసరాల్లో టూలెట్ బోర్డులు మాయమయ్యాయి. ప్రభుత్వం ఉద్యోగాలు ప్రకటిస్తే ఇసారి జాబ్ కొట్టుకునే ఇంటికి వెళ్లాలనే ఆలోచనలో నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ల ఆశల ప్రకారమే త్వరలోనే భారీ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పోలీసులు ఉద్యోగ ప్రకటన రానున్నట్టు తెలుస్తున్నది. సీఎం ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.