Telugu Mirror : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వివిధ రిక్రూట్ మెంట్ బోర్డ్(Recruitment Board) లు భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నాయి. కేంద్ర, వివిధ రాష్ట్రాల నియామక సంస్థలు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక ప్రక్రియను ప్రారంభించాయి. ఉద్యోగ భద్రత కలిగి ఉండి, అనేక ప్రయోజనాలు అందించే ఈ ఉద్యోగాలకు నిరుద్యోగుల నుంచి పోటీ బాగానే ఉంటుంది. అయితే ఈ వారంలో దరఖాస్తు చేసుకునే నోటిఫికేషన్స్ ను ఓసారి పరిశీలించండి.
ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ :
ఇండియా పోస్ట్ 30,041గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలకు నియామక ప్రకటనను విడుదల చేసింది. ఆగస్టు 3నుండి దరఖాస్తుల దాఖలు ప్రారంభమైంది. జనరల్, OBC, SC, EWS, ST, PWD కేటగిరీ వారికి పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఆగస్టు 23 వరకు indiapostgdsonline.gov.in పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు.
AIIMS ఉద్యోగాలు :
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET-5) కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సంస్థ 7వ వేతన సంఘ సిఫార్సుల పే మ్యాట్రిక్స్ ప్రీ-రివైజ్డ్ పే బ్యాండ్-2లో, లెవల్ 7 నర్సింగ్ ఆఫీసర్ల నియామకం చేపట్టనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 25, సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్సైట్ aiimsexams.ac లో నమోదు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్షను సెప్టెంబర్17న, మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 7న నిర్వహిస్తారు.
Reliance Jio: త్వరలో జియో నుంచి అద్భుతమైన ఫీచర్స్ తో రెండూ 5G స్మార్ట్ ఫోన్స్ విడుదల
DSSSB రిక్రూట్మెంట్ :
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB).. TGT, PT లాబొరేటరీ అసిస్టెంట్, ఇతర ఉద్యోగాలకు ఆగస్టు 7న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నియామకాల్లో ల్యాబ్ అసిస్టెంట్ (గ్రేడ్ IV), సంగీతం టీచర్, అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్), అసిస్టెంట్ (Occupational Therapy (OT)/CSSD) విభాగాల్లో మొత్తం 1,841 ఉద్యోగాలను రిక్రూట్ చేస్తుంది. దరఖాస్తు రుసుం జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ST/SC/PWD/ Ex-Servicemen విభాగాలకు చెందిన అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు dsssbonline.nic.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Tea Effect on children : మీ పిల్లలు ‘టీ’ తాగుతున్నారా? అయితే ఈ సంఘటన గురించి మీకు తెలియాల్సిందే..
బీహార్ STET రిక్రూట్మెంట్ :
బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (BSEB), ఆగస్టు 9న బీహార్ సెకండరీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (STET)- 2023 నమోదు ప్రక్రియను మొదలు పెట్టింది. సెకండరీ లెవల్ టీచింగ్ ఉద్యోగాలకు అభ్యర్థులు పేపర్-1కి అప్లై చేసుకోవాలి. హయ్యర్ సెకండరీ లెవల్ పోస్టుల కోసం పేపర్- 2 కి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఒకటి లేదా రెండు పేపర్లకు కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 23 వరకు అధికారిక వెబ్సైట్ bsebstet.com లో ఎంట్రీ చేసుకోవచ్చు.
రాజస్థాన్ పోలీస్ డిపార్ట్మెంట్ :
రాజస్థాన్ పోలీస్ డిపార్ట్మెంట్ 3,578 కానిస్టేబుల్ పోస్టులకు నియామక ప్రకటనను రిలీజ్ చేసింది. ఆగస్టు 3న అధికారిక ప్రకటన రిలీజ్ అయినది. కాగా, ఆగస్టు 27 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. డ్రైవర్, కానిస్టేబుల్ (PTC), కానిస్టేబుల్ (GD), కానిస్టేబుల్ (మౌంటెడ్), కానిస్టేబుల్ (బ్యాండ్) ఉద్యోగాలకు atsso.rajasthan.gov.in అధికారిక పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చు.