నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్, SBI నుండి క్లర్క్ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టులు, ఇప్పుడే అప్లై చేసుకోండి

Good news for unemployed youth, Clerk and Deputy Manager Posts from SBI, Apply Now
image credit: Job Wala Portal

Telugu Mirror: డిగ్రీ అర్హత ఉండి ఇంకా నిరుద్యోగులుగా ఉన్నారా ? అయితే నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తన్న యువతకి SBI నుండి భారీ ఉద్యోగ నోటిఫికెషన్ (Job Notifications Release) విడుదల అయ్యాయి. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం వచ్చింది. SBI నుండి వచ్చిన నోటిఫికేషన్ 8773 క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత ఉండి, ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు నవంబర్ 17 నుంచి ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది డిసెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే సంవత్సరం జనవరి నెలలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉండగా ఫిబ్రవరి నెలలో మెయిన్స్ ఎగ్జామ్ (Mains Exam) ఉంది. జనరల్ / ఈడబ్ల్యుఎస్ / ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.750/- ఉండగా ఎస్సి/ఎస్టీ /PWBD అభ్యర్థులకు రుసుము ఉండదు.

విద్యార్హత : ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారు ఏదైనా గ్రాడ్యుయేషన్ లో ఉతీర్ణత సాధించి ఉండాలి. లేదా, డిగ్రీ ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టరు చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు 20 ఏళ్ల నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితిలో ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉండగా, పిడిడబ్ల్యు లకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

Good news for unemployed youth, Clerk and Deputy Manager Posts from SBI, Apply Now
image credit: mpcareer.in

దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. sbi.co.in వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు తేదీ : నవంబర్ 17
దరఖాస్తు చివరి తేదీ : డిసెంబర్ 7
అధికారిక వెబ్సైటు : sbi.co.in

SBI లో డిప్యూటీ మేనేజర్ పోస్ట్లు:
SBI రిక్రూట్మెంట్ ప్రక్రియ కింద 42 పోస్టులకు భర్తీ చేస్తారు. నవంబర్ 7న విడుదలయిన ఈ పోస్టులు నవంబర్ 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. SBI మేనేజింగ్ పోస్టులకు వయోపరిమితి 25 ఏళ్ళ నుండి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం :
SBI అధికారిక వెబ్సైటు sbi.co.in కి వెళ్ళండి. దరఖాస్తు చేసుకోవడానికి హోమ్ పేజీలో డిప్యూటీ మేనేజర్ పోస్ట్ (Deputy Manager Post) కోసం లింక్ ని క్లిక్ చేయండి. దరఖాస్తు ఫారంని పూర్తి చేసి రుసుముని చెల్లించాలి. అవసరమయ్యే డాకుమెంట్స్ ని అప్లోడ్ చేయండి. ఫ్యూచర్ ఉపయోగం కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in