sbi నుంచి సామాన్యులకు సైతం అద్భుత పథకం..కొత్త స్కీమ్ అమలులోకి..

Telugu Mirror: ప్రతి నెలా కొంత మొత్తంలో రాబడిని పొందాలని ఆలోచన మీకు ఉంటే మీ కోసం ఎన్నో రకాల పథకాలు అమలులో ఉన్నాయి. అలాంటి వాటిలో భారత దేశ బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India)అందించే స్కీమ్ కూడా ఒకటి ఉంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెలా పైకం పొందవచ్చు. SBI తన వినియోగ దారుల కోసం ఒక ప్రత్యేక పథకంను అందుబాటులో ఉంచింది. ఆ పథకమే SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్(Annuity Deposit Scheme). ఈ స్కీమ్ లో మీరు ఒక్కసారి డబ్బును డిపాజిట్ చేస్తే నెల నెలా మీకు వడ్డీని కూడా కలిపి ఇస్తుంది. యాన్యుటీ డిపాజిట్ పథకం గురించి తెలుసుకుందాం.

Image credit: Kalinga tv

SBI వారు తెలిపిన వివరాల ప్రకారం 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పాటు ప్రతి నెలా డబ్బును పొందవచ్చు. ఈ పథకంలో 36 నెలలు, 60 నెలలు, 120 నెలల పాటు కొనసాగే స్కీమ్ లు ఉన్నాయి. ఈ మూడు ఆప్షన్ లలో మీకు నచ్చిన స్కీమ్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న స్కీమ్ ని బట్టి మీకు బ్యాంక్ నెలనెలా డబ్బుని చెల్లిస్తుంది. యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ లో కనీస మొత్తం రూ.1,000 నుంచి మొదలుకొని ఎంత వరకు అయినా పొందవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడి ఎంత అనేదాని మీద మీకు లభించే యాన్యుటీ లో కూడా మార్పులు కలుగుతాయి. హై ఎండ్ పరిమితులు ఏమీ ఈ స్కీమ్ లో లేవు. మీరు ఎంత డబ్బును అయినా డిపాజిట్ రూపంలో పెట్టవచ్చు. టర్మ్ డిపాజిట్(Term Deposit)లకు అందించే వడ్డీ రేటును ఈ పథకంలో కూడా పొందవచ్చు.

Also Read:Home Renovation Loan : ఇంటి రీమోడలింగ్ కి కూడా లోన్..ఈ లోన్‌ ఆప్షన్స్‌ చెక్‌ చేయండి..

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాన్యుటీ స్కీమ్ లో డిపాజిట్ చేసి ఉన్నట్లు అయితే దాని పై లోన్ పొందే అవకాశం కూడా ఉంది. మీకు సమీపం లోని SBI బ్యాంక్ శాఖ ను సందర్శించి ఈ పథకం లో చేరవచ్చు. SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ లో మీరు మీకు నచ్చిన అంత అమౌంట్ ని పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. ఆ అమౌంట్ ని బట్టి ప్రతి నెలా యాన్యుటీ ని పొందవచ్చు. ఇదిలా ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోనే మరో డిపాజిట్ స్కీమ్ కూడా ఉంది దీనిలో 7రోజుల నుంచి 10 సంవత్సరాలకు నిర్ధిష్ట కాలపరిమితి కలిగిన ఫిక్స్ డ్ డిపాజిట్ పధకాలను అందిస్తుంది.

మీరు గానీ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి కలిగిన స్కీమ్ లలో అమౌంట్ ని డిపాజిట్ చేయాలని అనుకుంటే.. ఈ స్కీమ్ మీకు అత్యధికంగా 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాన్యుటీ డిపాజిట్ పథకంలో డిపాజిట్ చేయాలని అనుకుంటే.. మీరు కనీస మొత్తం 25,000 డిపాజిట్ చేయాలి. ఎటువంటి రిస్క్ లు లేకుండా ఆదాయం రావాలి అని భావిస్తే ఈ స్కీమ్ ని ఎన్నిక చేసుకోవడం మంచిది. ప్రతి నెలా మీరు పెట్టిన పెట్టుబడి మొత్తంలో కొంత భాగం మరియు వడ్డీ, ఈ రెండిటినీ కలిపి బ్యాంక్ మీకు అందిస్తుంది. అయితే ఈ విధానంలో కాలపరిమితి ముగిసిన అనంతరం మీకు ఏవిధమైన అమౌంట్ రాదని గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రతి నెలా మీకు చెల్లించే డబ్బు లోనే మీ పెట్టుబడి కూడా ఉంటుంది అని గుర్తుంచు కోవాలి. కాల పరిమితి తీరే సమయానికి మీ అసలు డబ్బు మరియు వడ్డీ కలిపి మీకు చేరతాయి.. మీ వద్ద డబ్బు ఉంటే, ఇంట్లో దాయటం కన్నా యాన్యుటీ పథకంలో డిపాజిట్ చేయడం వలన వడ్డీ వస్తుంది అలాగే ప్రతి నెలా కొంత పైకం కూడా మీకు చేరుతుంది. ఎటువంటి రిస్క్ ఉండదు. వడ్డీతో కలిపి వచ్చిన అసలు సొమ్ములోని కొంత డబ్బు ని అవసరం అనుకుంటే మళ్ళీ ఇన్వెష్ట్ చేయవచ్చు.

Leave A Reply

Your email address will not be published.