Telugu Mirror : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
వసుధారా రిషిని తీసుకొస్తుంది అని చెప్పడంతో శైలేంద్రకి మరియు దేవయానికి చెమటలు పడుతున్నాయి. రిషి వస్తున్నాడని శైలేంద్ర చెప్పాడు కాబట్టి మహీంద్ర వాళ్ళ వదినతో కాలేజికి రావాల్సిందే అని చెబుతాడు. కానీ దేవయాని రాను అని చెబుతుంది. ఇప్పుడు రిషి వస్తున్నాడు, నీ కొడుకు చేసిన దుర్మార్గాలు బయటపెట్టాల్సిన టైం వచ్చింది. ఈ దారుణాలు నీ కొడుకు చేయడానికి కారణం మీరే కదా వదిన గారు అందుకే నీ కొడుకుకి పడే శిక్ష దగ్గర ఉండి చూడాలి కదా అందుకే రండి అని మహీంద్ర దేవయానితో చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
ముఖ్య అతిధిగా మినిస్టర్ గారు..
డిబిఎస్టి కాలేజీ ఈవెంట్ లో మినిస్టర్ గారు ముఖ్య అతిథిగా వస్తారు. కాలేజీ స్టాఫ్ అంతా అతనికి బొకేలు ఇచ్చి ఆహ్వానం పలుకుతారు. మినిష్టర్ గారు రాగానే ఇక ప్రోగ్రాం మొదలు పెడతారు. ముందు క్లాసికల్ డాన్స్ తో స్టార్ట్ చేస్తారు. ఇక మినిస్టర్ గారికి కాలేజీ తరుపున సన్మానం చేస్తారు.
ఎండీ వసుధారా స్పీచ్..
Also Read : Guppedantha Manasu serial today episode : శైలేంద్ర అంతు చూస్తానంటున్న వసుధారా, భయంలో దేవయాని, శైలేంద్ర
కాలేజీ టైం అనేది అయిపోతే మళ్ళీ తిరిగి రాదని, ఇప్పుడు కష్టపడితేనే జీవితం బాగుంటుందని, జీవితంలో అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముకోవాలని చెబుతుంది. అందరికీ ఎగ్జామ్స్ బాగా రాయమని చెబుతుంది.
తర్వాత మినిస్టర్ గారు మాట్లాడుతారు. కాలేజీలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్లే పిల్లల్లో ఉన్న ప్రతిభ బయటపడుతుందని చెప్పారు. వసుధారా ఇదే కాలేజీలో స్టూడెంట్ గా చదివి ఒక ఎండి స్థాయికి ఎదిగింది అని చెబుతారు. వసుధారను, రిషి సర్ ని ఆదర్శంగా తీసుకోండి అని చెబుతారు.
రిషిని చంపేయాలని ప్లాన్ లో శైలేంద్ర..
కార్యక్రమం జరుగుతుండగానే శైలేంద్ర రాజీవ్ కి ఫోన్ చేసి రిషి దొరికాడా అని అడుగుతాడు. రాజీవ్ రిషి దొరకలేదని, మీరేం టెన్షన్ పడకండి హాయిగా ఉండండి నేను మీకు ఉన్నాను అని రాజీవ్ శైలేంద్రతో అంటాడు. రిషిని చంపడానికి ఈ శైలేంద్ర మరో వ్యక్తిని కూడా పెట్టాడు.
ఇది అంతా ధరణి ప్లాన్..
టెన్షన్ పడుతున్న దేవయానిని చూసి ధరణి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏమైంది అత్తయ్య టెన్షన్ పడుతున్నారు ఎందుకు అని అడుగుతుంది. మీ టెన్షన్ కి కారణం ఏంటి? నాకు చెప్తే ఏదైనా సలహా ఇస్తా కదా అని చెబుతుంది. అప్పుడు దేవయాని రిషి కాలేజీకి వస్తున్నాడు అని చెబుతుంది. రిషి వస్తే మంచిదేగా అత్తయ్య అందులో టెన్షన్ ఏముంది? మీరు ఏదైనా తప్పు చేసారా, లేక మీ అబ్బాయి ఏదైనా తప్పు చేశాడా అంటూ అడుగుతుంది. అయినా మీరు తప్పులు చేసి ఉంటారులే అని అంటుంది.
ఈ ఐడియా ఎవరు ఇచ్చారో ఏంటో అని అంటుంది దేవయాని. ఆ ఐడియా ఇచ్చింది నేనే అత్తయ్య అని ధరణి చెబుతుంది. రిషి కాలేజీకి వస్తున్నట్టు చెప్పమని చెప్పా, నేను చెప్పినట్టే మా ఆయన చేసారు అని ధరణి చెప్పింది. ఐడియా చెప్పిందా నువ్వా అంటూ దేవయాని షాక్ అవుతుంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…