Telugu Mirror : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
శైలేంద్ర, దేవయాని ఆనందం..
భద్ర తప్పించుకున్న విషయం తెలియగానే శైలేంద్ర, దేవయాని ఇద్దరూ ఆనందంతో గంతులు వేస్తున్నారు. దేవయాని,శైలేంద్ర మాటలు విన్న ధరణి వీరి పాపం తొందరలోనే పండుతుందని అంటుంది. వీరి దుర్మార్గాలు బయటపడతాయి అని, ఈరోజు మీరు సంతోషంగా ఉండొచ్చు కానీ ఆ దేవుడు ఉన్నాడు, మీ పాపాలు బయటపడతాయి అని ధరణి మనసులో అనుకుంటుంది.
రిషి కోసం మహీంద్ర, వసుధార భయం..
ముఖుల్ భద్ర తప్పించుకున్నాడు అని చెప్పగానే అందరూ షాక్ అయి మరి రిషి గురించి ఎలా తెలుస్తుంది అని ముఖుల్ అని ప్రశ్నించారు. అది అంతా తర్వాత సర్, మీరు ఒక పని చేయాలి.. అందరూ ఒకసారి హాస్పిటల్ దగ్గరకి రావాలి అని ముఖుల్ అడుగుతాడు. హాస్పిటల్ కి ఎందుకు? ఏమైంది అని మహీంద్ర ప్రశ్నించగా.. ఒక డెడ్ బాడీ గుర్తుపట్టడం కోసం ఒకసారి హాస్పిటల్ కి రమ్మని చెబుతాడు. మిస్సింగ్ కేసు పెట్టిన వారికి సాధారణంగా ఇది జరుగుతుంది ఏమి కాదు ఒకసారి వచ్చి చూసుకోండి అని ముఖుల్ చెబుతాడు.
కానీ అక్కడ ఎవరు ముఖుల్ మాట వినరు. అది రిషి బాడీ కాదు, రిషికి ఏమి కాదు అని అంటుంటారు. ఇంతలో ముఖుల్ ఒక టీ-షర్ట్ తీసుకొచ్చి చూపిస్తాడు. ఇది రిషిదేనా అని అడుగుతాడు, వసుధార వాళ్ళ నాన్న అవును ఇది రిషిదే అని చెబుతాడు. ఫెస్ట్ కి వచ్చే ముందు అల్లుడు గారు ఇదే వేసుకున్నారని చెబుతాడు. ఇక అందరూ దిగులు చెందుతారు. మహింద్ర హాస్పిటల్ కి వెళ్తాడు. వసుధార ఏడుస్తూ ఇంట్లోనే ఉంటుంది.
Also Read : Guppedantha manasu serial feb 3rd episode : కస్టడీ నుండి తప్పించుకున్న భద్ర, ఆనందంలో శైలేంద్ర, దేవయాని
మహీంద్ర కోసం ఫణింద్ర కంగారు..
మహీంద్ర ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని కంగారు పడుతూ ఉంటాడు ఫణింద్ర. ఎన్ని సార్లు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ధరణి కి చెబుతాడు. అనుపమ కి ఫోన్ చేయమని ధరణి చెబుతుంది. ఫణింద్ర ధరణికి ఫోన్ చేస్తుంది. అనుపమ జరిగిన సంగతి చెబుతుంది. ఫణింద్ర కంగారు పడుతూ ఉంటాడు. హాస్పిటల్ కి మహీంద్రని ఒక్కడినే ఎలా పంపించారు? అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి అని అంటాడు. రిషికి ఏమి కాదు అని మేము నమ్ముతున్నాము సర్ అని అనుపమ అంటుంది. ఫణింద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు.