Telugu Mirror : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. గుప్పెడంత మనస్సు సీరియల్ కి మంచి రేటింగ్ కూడా ఉండేది కానీ సీరియల్ టైమింగ్స్ మారాయి కాబట్టి రేటింగ్ లో కాస్త తగ్గింది. గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
వసుధారా శైలేంద్రకి రిషిని తీసుకొస్తా అని అని చెప్పి శైలేంద్ర ప్లాన్ ప్లాప్ చేస్తుంది. శైలేంద్ర వసు బావకి ఫోన్ చేసి ఆ చక్రపాణిని పట్టుకోని రిషిని చంపేయాలని చెప్పాడు. ఇంతలో చక్రపాణికి ఫోన్ వస్తుంది. తన స్నేహితుడు ఫోన్ చేసి వాళ్ళ కూతురి పెళ్లి ఉందని ఎక్కడ ఉన్నావ్? కార్డు ఇవ్వడానికి వస్తా అని అడుగుతాడు. కానీ ఇదంతా వసుధారా బావ అతనితో ఫోన్ చూపిస్తాడు. కానీ చక్రపాణి నిజం చెప్పకుండా రాలేని పరిస్థితిలో ఉన్నానని అర్ధం చేసుకోమని చెబుతాడు.
చక్రపాణి స్నేహితుడిని ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తాడు. ఇంతలో వసుధారా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి రిషి సర్ ని తీసుకురమ్మని చెబుతుంది.
Also Read : Guppedantha Manasu serial today episode : రిషిని ఈవెంట్ కి తీసుకొస్తున్న వసుధారా, శైలేంద్ర ప్లాన్ ప్లాప్
మహేంద్ర, అనుపమ వచ్చి వసుధారా రిషిని తీసుకురావడం ఏంటి? రిషి ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో ఏంటో అని చెబుతారు. అప్పుడు వసుధారా, రిషి సర్ వస్తున్నారు. అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని, శైలేంద్ర దుర్మార్గాలు బయటపెడతానని చెబుతుంది. రిషి సర్ వస్తున్నారని ఫణింద్ర సర్ మరియు స్టూడెంట్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు.
రిషి సర్ ని తీసుకొచ్చి ఈ ఈవెంట్ సక్సెస్ చేయాలి అని వసుధారా చెబుతుంది. శైలేంద్రకి రిషి సర్ గురించి తెలిస్తే ఏం చేస్తారు? ఈ కాలేజీలో రిషి సర్ ని టచ్ చేసే దమ్ము ఉందా అని అంటుంది. శైలేంద్ర నాటకాలకు ఈరోజే తెర పడుతుంది అని వసుధారా గట్టిగా చెబుతుంది. తాడో పేడో తేల్చుకుంటా అని వసు చెబుతుంది.
ఈవెంట్ సక్సెస్ కాదని దేవయాని ఇంట్లో సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకుంటుంది. ఇంతలో శైలేంద్ర ఫోన్ చేసి ప్లాన్ మొత్తం ప్లాప్ అయిందని, ఆ రిషి కాలేజీకి వస్తున్నాడని చెబుతాడు. వాళ్ళ అమ్మని కాలేజీకి రమ్మని చెబుతాడు శైలేంద్ర. ఇంతలో శైలేంద్ర ఫోన్ తీసుకొని మహీంద్ర మాట్లాడుతాడు.
ఈరోజు తల్లి కొడుకులు చేసిన దుర్మార్గాలు బయటపడతాయి అని దేవయానిని కాలేజీకి రమ్మని చెబుతాడు మహీంద్ర. ఇక దేవయాని షాక్ అవుతుంది.