Hanuman Movie : హనుమాన్ మూవీ పై కలెక్షన్ల వర్షం, ప్రశంసలు కురిపిస్తున్న తారలు

hanuman-movie-raining-collections-stars-showering-praises
Image Credit : Film Companion

Telugu Mirror : ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ కంబోలో కేవలం 11 కోట్ల రూపాయలుతో తెరకెక్కిన హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పుడు చూడనంత పెద్ద మిరాకిల్ నే క్రియేట్ చేసింది, సినిమా విడుదలైన ఐదు రోజులకే 100 కోట్లు క్లబ్ లో కి చేరి సంక్రాంతి రేస్ లో అన్ని సినిమాలని దాటుకొని విన్నర్ గా నిలిచింది.

సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మన దేశంతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది సినిమా మన దగ్గర వచ్చేసి మొత్తం 200 పైగా థియేటరలో సినిమాని విడుదల చేశారు.

ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటివరకు మొత్తం 900K డాలర్స్ పైన వరకు కలెక్ట్ చేసింది, అంతేకాకుండా మొదటి రోజు 552k డాలర్స్ కలెక్ట్ చేసి ఇప్పటి వరకు 472k ఫస్ట్ డే RRR కలెక్షన్ రికార్డ్ నీ బ్రేక్ చేసింది.

అంతేకాకుండా న‌ట‌సింహం బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) నిన్న హైద‌రాబాద్‌ ప్ర‌సాద్ ల్యాబ్‌లో కుటుంబ స‌మేతంగా చిత్ర యూనిట్‌తో క‌లిసి హ‌నుమాన్ (HanuMan) సినిమాను చూసారు. ఆ తర్వాత, ఆయ‌న మాట్లాడుతూ సినిమాలో కంటెంట్ మంచిగ ఉందని, టెక్నిక‌ల్ డిపార్ట్ మెంట్‌ను మంచిగా వాడుకున్నార‌ని, క‌థ‌ను మంచిగా హ్యాండిల్ చేశార‌ని, చూడడానికి క‌నుల పండుగగా ఉందని చెప్పుకొచ్చారు.

Also Read : Salaar OTT release : రెబల్ స్టార్ నటించిన సినిమా సలార్, ఓటీటీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనుందో తెలుసా?

తాజాగా ఈ హ‌నుమాన్ (HanuMan) సినిమాను క‌ర్ణాట‌క‌లో క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్ (Shiva rajkumar) ప్రత్యేక షో వేయించుకుని మరి  చూశారు. అనంత‌రం హ‌నుమాన్ చిత్ర యూనిట్‌తో స‌మావేశ‌మై వారిపై ప్ర‌శంస‌లు కురిపించారు. నేటి స‌మాజానికి ఇలాంటి సినిమాలు చాలా ముఖ్యం అని, మ‌న స‌నాత‌న‌ ధ‌ర్మాలు, వేదాలు ప్రతి ఒక్క‌రికి చేరాలని అయన చెప్పారు. ఇలాంటి అద్భుత చిత్రాన్ని తీసిన ప్ర‌శాంత్ వ‌ర్మ (Prasanth Varma), నిర్మాత నిరంజ‌న్ రెడ్డి, న‌టీన‌టులు తేజ (tejasajja), అమృత (Amritha), వ‌ర‌ల‌క్ష్మి, విన‌య్ ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు.

తేజ సజ్జా హీరోగా చేసిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే. నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని అందించారు.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in