Telugu Mirror: ఈ కాలం లో చదువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధనవంతులు చదివించడం పెద్ద గొప్ప విషయం కాదు కానీ ఒక పేద కుటుంబం నుండి చదువుని అభ్యసించి గొప్ప స్థాయిలో నిలబడడం మాత్రం చాల గొప్ప విషయమనే చెప్పుకోవాలి. కింది స్థాయి నుండి కష్టపడి పైకొచ్చిన ఎందరో మహనీయులని మనం చూసే ఉంటాం. అయితే తాజాగా ఒక వీడియో పిల్లల భవిష్యత్తులో వెలుగు నింపేందుకు ఓ తల్లి చేస్తున్న ప్రయత్నం సోషల్ మీడియా ను ఆకట్టుకుంది. ఆ తల్లి ఒక పండ్ల కొట్టుని నడుపుకుంటూ వారి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు ప్రయత్నిస్తుంది. వినియోగదారులు లేని సమయం లో ఆ పిల్లల వద్దకు వచ్చి కూర్చొని తమ పిల్లలకు భోదించే వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఒక పక్క పండ్ల కొట్టు నడుపుకుంటూ మరో వైపు తన పిల్లల భవిష్యత్తు పై చూపించే జాగ్రత్త అందరి మనసులకు హత్తుకుపోయింది. ఈ వీడియో ని గతంలో ట్విట్టర్ (Twitter) ఇప్పుడు ఎక్స్ (X) గా పిలవబడిన ఫ్లాట్ ఫామ్ లో అధికారికంగా పోస్ట్ చేసారు మరియు ఈ వీడియో తో ఆమె ఫుల్ వైరల్ గా మారిపోయింది.
కొన్ని రాష్ట్ర-రిజిస్టర్డ్ వాహనాలు ఆ పండ్ల కొట్టు పక్కన పార్క్ చేయబడ్డాయి. ఆ పండ్ల కొట్టు పక్కనే ఉన్న ఒక వాహనం గమనించి అది కర్ణాటక (Karnataka) కి చెందిన వాహనం కాబట్టి ఈ వీడియో కర్ణాటకకు చెందినదని నమ్ముతున్నారు. అయితే జార్ఖండ్ (Jarkand) కు చెందిన ఓ అధికారి ఎక్స్ (x) లో పోస్ట్ చేసాడు.కలెక్టర్ సంజయ్ కుమార్ (Collector Sanjay Kumar) ఆ వీడియో కి క్యాప్షన్ ఇవ్వడానికి తనకు మాటలు రావట్లేదని ఆ వీడియో ని పంచుకునే సమయం లో అన్నారు. వీడియో లో హూడి జాకెట్ ధరించిన లేడీ “BOSS” నెట్టింట అందరి మనసులను గెలుచుకొని నైపుణ్యాలను పెంపొందించడం లో ఒకరి లా నిలిచారు.
आज कैप्शन के लिये मेरे पास शब्द ही नहीं हैं..!!
💕#मां #Respectfully 🙏 pic.twitter.com/8A3WEFmAMg— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) August 29, 2023
ఆ తల్లికి సెల్యూట్ చేస్తున్న నెటిజెన్స్.
ఈ వీడియో ఎక్స్ లో ఆగష్టు 29న పోస్ట్ చేసినప్పటి నుండి బోలెడన్ని వ్యూస్ , ఎన్నో లైక్స్ తో అందరిని ఆకట్టుకుంది.అందరి చేత సెల్యూట్ చేపించుకుంది. కేవలం 29 సెకండ్ల తో కూడిన ఈ వీడియో అందరి హృదయాలను కరిగించే సామర్ధ్యాన్ని కలిగి, అందరి గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఈ ఫోటేజ్ చూసిన వారందరు ఆమెకు సెల్యూట్ చేస్తూ కామెంట్ల రూపం లో ఆమెకు అభినందలు,పొడగ్తల వ్యాఖ్యాలతో నిండిపోయింది.