దీపావళి పండుగకు ఇంటిని శుభ్రపరచారా ? అయితే మీ వంట గదిని ఇలాగే క్లీన్ చేశారా?
దీపావళికి ఇంటిని శుభ్రపరచు కోవాలని అనుకుంటారు. పరిశుభ్రంగా మరియు అందంగా అలంకరించిన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం ఉంటుంది. కాబట్టి ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి ముఖ్యంగా వంటగదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిని శుభ్ర పరిచేటప్పుడు కొన్ని చిట్కాలను పాటించినట్లయితే పని సులువుగా అయిపోతుంది.
దీపావళి అంటే దీపాల వరుస. అనగా వెలుగుల పండుగ. చెడు పై మంచి విజయం సాధించినందుకు సంకేతంగా ఈ పండుగను జరుపుకునే ఆనవాయితీ వస్తుంది. ఈ విజయాన్ని కుటుంబ సభ్యులందరి తో కలిసి ఆనందంగా జరుపుకుంటారు.
దీపావళికి ముందే ఇంటిని శుభ్రపరచు కోవాలని మరియు అందంగా అలంకరించుకోవాలి అని అనుకుంటారు. పండుగ సందర్భంగా లక్ష్మి పూజ చేస్తారు. కాబట్టి పరిశుభ్రంగా మరియు అందంగా అలంకరించిన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం (advent) ఉంటుంది. కాబట్టి ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి ముఖ్యంగా వంటగదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
వంటగదిని శుభ్ర పరిచేటప్పుడు ఇటువంటి కొన్ని చిట్కాలను పాటించినట్లయితే మీ పని సులువుగా అయిపోతుంది. అవి ఏమిటో చూద్దాం.
వంటగది ని శుభ్రం చేసేటప్పుడు కిచెన్ క్యాబినెట్లు మరియు అలమరాలు పరిశుభ్రంగా ఉండాలంటే ఆరు నెలల నుండి వాడని వస్తువులు ఏమైనా ఉంటే వాటిని పడేసే ప్రయత్నం చేయాలి.
పాడైన వంట సామాన్లు, విరిగిపోయిన వస్తువులను తీసేయాలి. మిగిలిన వస్తువులను ఒక క్రమ పద్ధతి (Regular method) లో సర్దుకోవాలి
చిమ్నీ లు లేదా ఎగ్జాస్ట్ లలో ధూళి (dust) మరియు జిడ్డు ఎక్కువగా పేరుకుపోయి ఉంటుంది.
వీటిని శుభ్రం చేయాలంటే కొద్దిసేపు గోరువెచ్చని నీటిలో నాన బెట్టడం వలన జిడ్డు త్వరగా వదిలిపోతుంది. వేడి నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా మరియు డిష్ సోప్ లో నాన్ పెట్టడం వల్ల ధూళి మరియు జిడ్డు (oily0) చాలా సులువుగా తొలగిపోతాయి.
బొద్దింకలు వంట గదిలో ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి తిన్న ప్లేట్లలో ఉన్న చెత్తను సింక్ లో పడేయకూడదు. ఇంట్లో తీపి పదార్థాలు ఏమైనా కింద పడినట్లయితే వాటిపై కీటకాల చంపే మందు వేయడం వలన పని సులువుగా అవుతుంది.
Also Read : Vaastu Tips : దీపావళి రోజున ఇంట్లో ఈ మొక్కలను పెంచండి.. మీ ఇంటిని సిరిసంపదల నిలయంగా మార్చండి
వంట చేసే సమయంలో ఆవిరి (steam) ద్వారా అల్మరాలకు, గోడలకు బాగా జిడ్డు మరియు దుమ్ము అంటుకొని ఉంటుంది. వీటిని తరచుగా శుభ్రం చేయకపోతే అక్కడ జిడ్డు మరియు ధూళి బాగా దట్టంగా పేరుకుని ఉంటుంది.
ఈ మరకలను వదిలించాలంటే గోరువెచ్చని నీటిలో వెనిగర్ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని ఉపయోగించి పొడి బట్టతో కానీ టిష్యూ పేపర్ తో కానీ శుభ్రం చేస్తే మందం (thickness) గా పేరుకుపోయిన మరకలు సులువుగా వదిలి పోతాయి.
ఫ్రిజ్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కూరగాయలు మరియు పండ్లను పెడుతుంటారు. అంతేకాకుండా దీనిలో వండిన ఆహార పదార్థాలను కూడా ఉంచు తుంటారు. అయితే ఫ్రిజ్లో పాడైపోయిన (damaged) పదార్థాలు ఏమైనా ఉంటే వెంటనే తీసేయాలి.
ఫ్రిజ్ చెడు వాసన రాకుండా ఉండడం కోసం గోరువెచ్చని నీటితో ఫ్రిజ్ లోపల శుభ్రం చేయాలి. ఫ్రిజ్ బయట క్లీనింగ్ లిక్విడ్ ను ఉపయోగించవచ్చు.
Also Read : Vaastu Tips : అన్నపూర్ణా దేవి అనుగ్రహం పొందాలంటే, వంట గదిలో ఈ వస్తువులను ఉంచకండి
సింక్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా మార్కెట్లో లభ్యమయ్యే డిష్ సోప్ లేదా క్లీనింగ్ పౌడర్ల ను ఉపయోగించి శుభ్రంగా ఉంచుకోవచ్చు.
సింక్ లో నీళ్లు వెళ్ళే పైపులైన్ జాలి (mesh) వద్ద వేడి నీటిలో, బేకింగ్ సోడా వేసి ఆ నీటిని సింక్ లో పోయాలి. ఇలా చేయడం వలన పైపు లలో ఏదైనా చెత్త అడ్డుకొని ఉంటే కొట్టుకొని పోతుంది.
కాబట్టి పండుగకు ముందు ప్రతి ఇల్లాలు ఇంటిని శుభ్రపరచడం సహజం. కనుక వంటగదిని శుభ్రం చేసేటప్పుడు ఈ చిట్కాలను పాటించడం ద్వారా వంటగదిని క్లీన్ చేయడం చాలా సులువు అవుతుంది.
Comments are closed.