ఫ్రిడ్జ్ ను ఎక్కువగా ఆహార పదార్థాలు (Foodstuffs) నిలువ చేయడానికి ఉపయోగిస్తారు. ఫ్రిజ్లో కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రమే ఉంచాలి. చాలామంది ఫ్రిడ్జ్ తీసుకున్నాక రెండు మూడు రోజులకు సరిపడా ఆహార పదార్థాలను నిల్వ చేసుకొని వాడుతుంటారు. అంతేకాకుండా కూరగాయలు మరియు పండ్లు తాజాగా ఉండడం కోసం పెడుతుంటారు.
అయితే ఫ్రిజ్ లో కొన్ని రకాల కూరగాయలు మరియు ఆహార పదార్థాలు పెట్టకూడదు అనే విషయం చాలా మందికి తెలియదు. ఫ్రిజ్ లో పెట్ట కూడని ఆహార పదార్థాలను ఉంచినట్లయితే అవి విషం (poison) గా మారతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read : రంగు మారిన దంతాలను తెల్లగా, ధృఢంగా మార్చి నోటి దుర్వాసన సైతం మాయం! ఇవి వాడితే రిజల్ట్ ఖాయం.
చాలామంది ఎక్కువగా చేసే పని ఉల్లిపాయలు (Onions) ఎక్కువ మొత్తంలో కట్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేస్తారు. ఈ విధంగా చేయడం వలన చాలా రకాల రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కట్ చేసిన ఉల్లిపాయలను నేరుగా ఫ్రిజ్ లో నిల్వ చేయడం వలన ఎటువంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకుందాం.
కట్ చేసిన ఉల్లిపాయలను నేరుగా ఫ్రిజ్లో నిల్వ చేయడం వలన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. వీటిని తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్లో ఉంచితే చెడు వాసన (bad smell) కూడా వస్తాయి. ఈ వాసన ఫ్రిజ్లో ఉన్న మిగిలిన ఆహార పదార్థాలు కూడా వ్యాపిస్తుంది. దీనితో వాటికి ఉన్న రుచిని కోల్పోతాయి.
ఫ్రిజ్ లో కట్ చేసిన ఉల్లిపాయలను ఉంచినట్లయితే వాటిలో ఉన్న పోషక విలువలు (Nutritional values) నశిస్తాయి.కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్లో ఉంచినప్పుడు వాటికి ఇంకా ఎక్కవ తేమ తగలడం వల్ల అవి వ్యాధికారక క్రిములను మరియు బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తాయి.
అంతేకాకుండా కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్లో ఉంచినప్పుడు చల్లని ఉష్ణోగ్రత లతో స్పందించ గల ఎంజైమ్ లను కలిగి ఉంటాయి. ఈ ప్రతిచర్య వల్ల సల్ఫరస్ సమ్మేళనాలు ఏర్పడడానికి దారితీస్తాయి.దీనికి కారణం ఉల్లిపాయ సల్ఫర్ ను కలిగి ఉంటుంది.
కట్ చేసిన ఇటువంటి ఉల్లి ముక్కలను వంటకు ఉపయోగిస్తే వండిన పదార్థాలకు చేదు (bitter) ను కలిగిస్తాయి.
పొట్టు తీసిన ఉల్లిపాయలను కూడా కొంతమంది ఫ్రిజ్లో ఉంచుతారు. ఇలా చేయడం కూడా ప్రమాదకరం. ఉల్లిపాయను కట్ చేసినప్పుడు (Chemicals) వెలువడతాయి. ఇవి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి.
Also Read : Benefits Of Cumin Seeds : అధిక బరువు నుండి డయేరియా వరకు నిద్ర లేమి నుండి నులిపురుగులు దాకా నివారించే జీలకర్ర
కాబట్టి ఉల్లిపాయలను 40°ల ఫారిన్ హీట్ లేదా ఫ్రిజ్ లోపల 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద టైట్ గా ఉన్న కంటైనర్ లో ఉంచడం సరైన విధానం.
కాబట్టి కొంతమంది తెలియక ఇటువంటి పొరపాట్లు చేసి అనారోగ్య సమస్యలు (health problems) తెచ్చుకుంటారు. కనుక ఉల్లిపాయ ముక్కలను నేరుగా ఫ్రిజ్లో నిలువ చేయకూడదని గుర్తించుకోవాలి. ఎప్పటికప్పుడు కట్ చేసుకొని తాజాగా ఉన్నప్పుడే వాడుకోవాలి.