Telugu Mirror : మానవ శరీరంలో రక్తం తక్కువగా ఉండడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది .కొంతమంది రక్తహీనతతో బాధపడుతుంటారు. శరీరంలో రక్తహీనత(Anemia) సమస్య ఆరోగ్యానికి, పెద్ద ఛాలెంజ్ గా మారుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు త్వరగా అలసిపోతుంటారు. బలహీనం(weak)గా ఉంటారు. చర్మం యొక్క రంగు(Skin colour) మారుతుంది అనగా పాలిపోయినట్లుగా కనిపిస్తారు. శ్వాస కోస సమస్యలను కూడా పెంచే అవకాశం ఉంది. ఇంకా రక్తహీనత వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి.
Home Renovation Loan : ఇంటి రీమోడలింగ్ కి కూడా లోన్..ఈ లోన్ ఆప్షన్స్ చెక్ చేయండి..
రక్తహీనత వలన మెదడు యొక్క ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని ఒక అధ్యయనంలో పరిశోధకులు హెచ్చరించారు. కాబట్టి రక్తహీనత ఉన్నవారు సరైన చికిత్స తీసుకోకపోతే మెదడు శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు .రక్తహీనత ఉన్నవారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అల్జీమర్స్(Alzheimer’s) వ్యాధి వల్ల మెదడులోని సెల్సు డీజనరేట్(Cells degenerate) అవుతాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి ,ఆలోచన సామర్థ్యం క్షీణిస్తుంది.మనిషి తన సామర్థ్యాన్ని కోల్పోతాడు.
3,00,000 లక్షల కన్నా ఎక్కువ మంది వ్యక్తులపై అధ్యయనం జరిపారు. రక్తహీనత ఉన్నవారికి కాలం గడిచే కొద్దీ అల్జీమర్స్ వ్యాధి వల్ల 56% ఎక్కువ ప్రమాదం ఉందని కనుగొన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న అల్జీమర్స్ వ్యక్తులకు మెదడు కుచించుకుపోవచ్చని కనుగొన్నారు .ఇలా జరగడం వలన వారు మరింత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
Realme C53 Launch : ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫస్ట్ సేల్ ఎప్పుడో తెలుసా?
అల్జీమర్స్ వ్యాధి వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోవడం(Memory Loss), నరాలకు నష్టం కలిగించడం మరియు మనిషి ప్రవర్తనలో మార్పులు రావడానికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. NYU లాంగ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రొఫెసర్ రీస్ మాట్లాడుతూ ఒక మనిషికి అల్జీమర్స్ఉంటే రక్తహీనత కారణంగా దాని యొక్క లక్షణాలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. గ్లూకోజ్ యొక్క పనితీరును కూడా దెబ్బతీసే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. గ్లూకోజ్(Glucose) అనేది మెదడులో శక్తిని ఉత్పత్తి చేసే యంత్రాంగం.
ఒక అంచనా ప్రకారం భారతీయ మహిళలలో సగం కంటే పైగా మరియు నాలుగవ వంతు మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత పురుషులకు కూడా రావచ్చు .కాబట్టి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు రక్తహీనత నుండి బయటపడవచ్చు.