Telugu Mirror : ఈ రోజుల్లో బిజీ లైఫ్(Busy Life) కు దగ్గరవుతున్న కొద్దీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించలేకపోతున్నారు. ఆ సమయంలో బయట ఫుడ్ ఎక్కువ గా తీసుకోడం వల్ల అనారోగ్యానికి గురవడం, బరువు విపరీతంగా పెరగడం లాంటివి జరుగుతున్నాయి. రెస్టారెంట్, హోటల్స్ నుండు వెలువడే వాసనతో మైమరచిపోయి ఆ ఫుడ్ కు అలవాటు పడిపోతున్నాం. అదే సమయం ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఎన్నో మార్గాలను వెతుకుతున్నాం.ఎన్నో వ్యాయామాలు చేస్తుంటాం. బరువు తగ్గడం లో వాకింగ్,ఎక్సరసైజ్లు , ఈత కొట్టడం మరియు డైట్(Diet) కూడా మెయింటైన్ చేస్తుంటాం.
Glowing Skin: మెరిసే చర్మానికి మురిపించే చిట్కాలు మీ కోసం, ఈ టిప్స్ పాటించండి.
బరువు తగ్గడం లో పండ్లు మంచి ఫలితాన్ని ఇస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎండు ద్రాక్షా కూడా బరువు తగ్గడం లో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎండు ద్రాక్ష బరువుని తగ్గించడం లో మంచి పాత్ర పోషిస్తుంది అని ఎందుకు చెప్తున్నాం అనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండు ద్రాక్షలో క్యాలరీలు తక్కువ గా ఉంటాయి ..
బరువు అదుపులో ఉంచుకోవాలంటే తక్కువ క్యాలరీలు తీసుకుంటే అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. 100 గ్రాముల చొప్పున ఎండు ద్రాక్ష తీసుకుంటే అందులో క్యాలరీ కంటెంట్ 83. అందువల్ల ఈ ఎండు ద్రాక్ష తినడం మంచిది.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ..
ఎండు ద్రాక్ష లో ఉండే పీచు పదార్థం తినడం వల్ల పేగు కి ఆరోగ్యానికి సమకూరుస్తుంది. దీనిలో ఉండే పోషకాలను పేగు తొందరగా గ్రహిస్తుంది. కాబట్టి ఇది తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.
యాంటీ యాక్సిడెంట్ ..
మన శరీర ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో అవసరం. పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్స్(Flavonoids) లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎండు ద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువుని నియంత్రించడమే కాకుండా చెక్కర స్థాయిలను అదుపులో ఉంచడానికి దోహద పడుతుంది.
Fast Food: ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా, అయితే మీ ఆరోగ్యాన్ని డస్ట్ బిన్ లో వేసినట్టే.
జీర్ణ క్రియ రేటు
వివిధ అధ్యయనాల ప్రకారం , ఎండు ద్రాక్షలో ఉండే పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు(Anti Oxidents) జీర్ణ క్రియను మెరుగుపరచడం లో సహాయపడుతుంది. అత్యధికంగా జీర్ణ క్రియ పై ప్రభావం చూపి బరువు తగ్గడం లో మంచి పాత్రను పోషిస్తుంది.
బాడీ ని మాయిశ్చరైసింగ్ గా ఉంచుతుంది.
శరీరం లో ఉండే టాక్సిక్ మెటీరియల్(Toxic Material) ను తొలగించాలంటే సరిపడా నీటిని తీసుకోవాలి. సరిగ్గా నీళ్లు తీసుకోకపోతే ఒంట్లో ఉండే కొవ్వు అంత సులువు గా పోదు. వాటర్ ఎక్కువ గా తాగడం వల్ల పేరుకుపోయిన టాక్సిక్ బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది.ఎండు ద్రాక్షలో నీరు అధికంగా ఉంటుంది కాబట్టి నీటి తో పాటు ఎండు ద్రాక్షని తీసుకోవడం కూడా మంచిదే.