కిచెన్ లో ఉండే సుగంధ ద్రవ్యాలు మరియు పోపు దినుసు లలో ఎన్నో రకాల ఔషధ గుణాలు (Medicinal properties) ఉన్నాయి. అందుకే వంటగదిని వైద్యశాల తో పోల్చారు మన పెద్దలు. ప్రస్తుతం ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుడు దగ్గరికి వెళ్లి మందులు వాడటం అలవాటు చేసుకున్నాం. పూర్వపు రోజులలో చాలా రోగాలకు వంటింట్లో ఉన్న వాటినే ఉపయోగించి అనారోగ్య సమస్యలను తగ్గించుకునే వారు.
వంటలలో ఎక్కువగా ఉపయోగించే వాటిలో జీలకర్ర (cumin) ఒకటి. జీలకర్ర వంటకు రుచిని ఇస్తుంది. జీలకర్ర వేసి వండిన ఆహారాన్ని తింటే చక్కగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. జీలకర్రను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు జీలకర్ర లో ఉన్నాయి.
జీలకర్ర ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
నులిపురుగులు:
కడుపులో నులిపురుగులు (Worms) ఉంటే ఆకలి వేయదు. అంతే కాకుండా రక్తహీనత (anemia) వస్తుంది. ముఖ్యంగా ఈ నులిపురుగులు పిల్లల కడుపులో ఎక్కువగా ఉంటాయి. ఇవి పొట్టలో ఉండడం వల్ల వీళ్ళకి ఆకలి ఉండదు. అందుకే వీళ్ళు బలహీనంగా ఉంటారు. కాబట్టి కడుపులో నులిపురుగులు ఉన్న పిల్లలకి జీలకర్ర మరియు బెల్లం కలిపి తినిపిస్తే నులిపురుగులు నశిస్తాయి.
Also Read : Soaked Dry Fruits : ప్రతి రోజూ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మీ గుండె పదిలం.. శారీరక ఆరోగ్యం ధృడం
డయేరియా:
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కొత్తిమీర రసం, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీనిని భోజనం చేసిన తర్వాత త్రాగాలి. ఈ విధంగా రోజుకు రెండుసార్లు త్రాగడం వలన డయేరియా (Diarrhea) నియంత్రణలో ఉంటుంది.
నిద్రలేమి :
ప్రస్తుతం అందరి జీవితం ఉరుకుల పరుగుల మయం అయింది .అలాగే ఒత్తిడి (stress) కూడా పెరిగింది. దీనివల్ల చాలామంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారు జీలకర్ర ను దోరగా వేయించి, అరటి పండుతో కలిపి తినడం వలన నిద్ర చాలా బాగా పడుతుంది.
సీజనల్ వ్యాధులు:
జీలకర్ర రోగ నిరోధక శక్తి (Immunity) ని పెంచుతుంది. జీలకర్రను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తింటూ ఉండాలి. ఆరోగ్యాన్ని సంరక్షించడం లో చాలా బాగా సహాయపడుతుంది.
జీలకర్రను దోరగా వేయించి పొడి చేయాలి. ఒక గ్లాసు నీటిలో చిన్న అల్లం (ginger) ముక్కను దంచి వేసి మరిగించాలి. తర్వాత దీనిలో వేయించిన జీలకర్ర పొడి వేసి కలుపుకొని త్రాగాలి. ఈ విధంగా త్రాగడం వలన సీజన్ లో వచ్చే జలుబు, జ్వరం, గొంతు నొప్పి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది.
Also Read : Dry Cough : పొడి దగ్గు మిమ్మల్ని వేధిస్తుందా? ఇలా చేసి చూడండి, పొడి దగ్గు మాయం మీకు ఉపశమనం..
బరువు తగ్గుతారు:
అధిక బరువుతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో జీలకర్ర పొడి, మిరియాల పొడి (Pepper powder) మరియు కొద్దిగా దాల్చిన చెక్క Cinnamonపొడి వేసి కలిపి చిన్న మంటపై మరిగించాలి. ఈ విధంగా ప్రతిరోజూ పరగడుపున తాగితే కొన్ని రోజుల్లో బరువు తగ్గుతారు.
కాబట్టి జీలకర్రను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.
గమనిక : ఈ కథనం వివిధ మాధ్యమాల ద్వారా సేకరించి వ్రాయబడింది . వీటిని పాటించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు .