Benefits Of Millets : చింత లేని జీవితానికి చిరు ధాన్యాలు.

మిల్లెట్స్ లో పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మిల్లెట్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉండడంతో పాటు శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తాయి.

చిరుధాన్యాలను మిల్లెట్స్ (Millets) అంటారు. మిల్లెట్స్ లో పోషక విలువలు చాలా అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి.మిల్లెట్స్ ను ఫింగర్ మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు.

ఆఫ్రికా మరియు ఆసియా లోని చాలా ప్రాంతాలలో వీటిని విరివిగా పండిస్తారు. అయితే భారతదేశం, ఉగాండా, నేపాల్, ఇథియోపియా తో సహా అనేక దేశాలలో ముఖ్యమైన ఆహార పంట (food crop) గా పండిస్తున్నారు.

మిల్లెట్లలో ఉండే పోషక పదార్థాల వల్ల ఫిట్నెస్ లో బాగా ప్రసిద్ధి (famous) చెందింది. ఎందుకనగా వీటిని తీసుకోవడం వల్ల శరీరాన్ని బలంగా మరియు దృఢంగా చేస్తాయి. వీటిల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కనుక ఎముకలు ఉక్కు లా తయారవుతాయి‌. బరువును నియంత్రణలో ఉంచాలి అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎముకలు బలహీనంగా ఉన్నవారు రాగుల ను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.

మొలకెత్తిన ధాన్యాలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ (digestive system) ను బలోపేతం చేస్తుంది. ఫైబర్, ఆహారం సులువుగా జీర్ణం అవ్వడానికి తోడ్పడుతుంది. మిల్లెట్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉండడంతో పాటు శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తాయి.

Benefits Of Millets : Small grains for a worry free life.
image credit : Serious Eats

మొక్కజొన్న, గోధుమ, బియ్యంతో పోలిస్తే మిల్లెట్లలో పాలి ఫెనాల్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి. ఇది రక్తంలోని చక్కెర (Sugar) మోతాదు ని నియంత్రించడంలో సహాయపడతాయి.

ధాన్యాలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఫైబర్ ఆహారం సులువుగా జీర్ణం అవ్వడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను తినడం వలన జట్టు (Hair) మరియు చర్మానికి (Skin) చాలా మంచిది.ముఖ్యంగా మిల్లెట్లలో మొలకెత్తిన రాగుల ను తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

Also Read : Sesame Seeds Benefits : శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించే నువ్వులు

Dates Benefits : పోషకాల గని ఖర్జూర పండు. రోజూ రాత్రి రెండు ఖర్జూర మిమ్మల్ని ఎప్పటికీ ధృఢంగా ఉంచుతుంది.

మొలకెత్తిన మినుములు  తినడం వల్ల రక్తహీనత సమస్య ఉండదు. ఇది హిమోగ్లోబిన్ మోతాదు ని పెంచుతుంది. కాబట్టి రక్తహీనత (anemia) తో బాధపడేవారు మొలకెత్తిన మినమలను తినాలి.

మిల్లెట్స్ దంతాల (teeth)ను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడతాయి‌. అలాగే ఇవి చిగుళ్ల వాపును కూడా తగ్గిస్తాయి. పాలిచ్చే తల్లులు మొలకెత్తిన ధాన్యాలను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇది శరీరంలో గ్లూకోజ్ ను కూడా నియంత్రిస్తుంది.

కాబట్టి ప్రతి ఒక్కరూ మొలకెత్తిన మిల్లెట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. తద్వారా ఆరోగ్యంగా (Healthy) జీవించవచ్చు.

Comments are closed.