వాల్ నట్స్ (Wall nuts) ని అక్రోట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి మెదడు (brain) ఆకారంలో ఉంటాయి. వాల్ నట్స్ తినడానికి అంత రుచిగా లేకపోయినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను శరీరానికి చేకూరుస్తుంది.
ప్రతిరోజు నాలుగు వాల్ నట్స్ (soaked) తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వాల్ నట్స్ రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాల్ నట్స్ ఎముకలను (bones) మరియు దంతాలను (teeth) బలోపేతం చేసే గుణాలను కలిగి ఉన్నాయి. వాల్ నట్స్ లో ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేయడంలో తోడ్పడుతుంది.
వాల్ నట్స్ లో సహజంగానే మాంగనీస్ మరియు మెగ్నీషియం అలాగే ఆరోగ్యకరమైన కొవ్వు (fat) లు వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి గుండె (Heart) ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి.
వాల్ నట్స్ ని రాత్రిపూట నానబెట్టి మరుసుటి రోజు పరగడుపున తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వాల్ నట్స్ ని నానబెట్టి తినడం వల్ల కలిగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
వాల్ నట్స్ ని రాత్రిపూట నాన బెట్టడం వల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గిపోతుంది. ఇది యాంటీ న్యూట్రియెంట్. క్యాల్షియం, ఐరన్, జింక్ ఆహార పదార్థాల నుండి అవసరమైన ఖనిజాలను గ్రహించడం లో జోక్యం చేసుకుంటుంది. ఇది వాల్ నట్స్ లను జీర్ణం (digestion) చేయడంలో మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
Also Read : Sweaty Palms And Hands : కాళ్ళు చేతులకు అధిక చెమట పడుతుందా? మీ సమస్యకు పరిష్కారం ఇక్కడ ఉంది.
వాల్ నట్స్ లో మెగ్నీషియం మరియు మాంగనీస్ వీటితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు కూడా ఉన్నాయి వీటిని రాత్రిపూట (Night) నానబెట్టి తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు పెరగడానికి సహాయపడతాయి తద్వారా L D L స్థాయిలు తగ్గుతాయి.
వాల్ నట్స్ వేడిని కలిగిస్తాయి. జీర్ణ క్రియ మరియు ప్రేగు (Intestine) సంబంధిత సమస్యలు ఉన్నవారికి జీర్ణం అవ్వడం కష్టం. అయితే వాల్ నట్ లను నీళ్లలో నానబెట్టి తినడం వల్ల వాటిలో ఉండే వేడెక్కించే సామర్థ్యం తగ్గిపోతుంది. తద్వారా సులభంగా జీర్ణం కూడా అవుతుంది. వాల్ నట్స్ ని నాన బెట్టడం వలన వాటిలో ఉండే చేదు (bitter) కూడా తగ్గిపోతుంది.
Also Read : Amla Juice : ఉసిరి రసం ఇలా తీసుకోండి ఆరోగ్య ప్రయోజనాలు పొందండి
మధుమేహంతో బాధపడేవారు నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి. వాల్ నట్స్ లను ప్రతిరోజు తినే వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. వాల్ నట్స్ రక్తంలో చక్కెర స్థాయి (Sugar levels) ని నియంత్రణలో ఉంచుతాయి. వాల్ నట్స్ ని నానబెట్టి తినడం వల్ల అవి మృదువుగా(soft) అవుతాయి. తద్వారా వీటిని నమలడం కూడా సులువు అవుతుంది.
కాబట్టి ప్రతిరోజు నాలుగు నానబెట్టిన వాల్ నట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. తద్వారా చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.