Telugu Mirror: డెంగ్యూ రోగుల్లో ప్లేట్ లేట్ కౌంట్(platelate count) తగ్గడం సహజమే .రక్తంలో ఉండే చిన్న రంగులేని కణాలు గడ్డలను ఏర్పరుస్తాయి. దీంతో రక్త సరఫరా ఆగిపోతుంది .డెంగ్యూ విషయానికొస్తే వైరస్ కారణంగా దాని యొక్క మోతాదు తగ్గడం ఆరంభం అవుతుంది. ఇలాంటప్పుడు కఠినమైన వ్యాధులు ప్రమాదం పెరుగుతుంది. అందుకే దేహంలోని రక్తాన్ని పెంచడంలో సహాయ పడే పౌష్టికాహారం తీసుకోవాలని అందరూ సూచిస్తారు.
రక్తంలో ప్లేట్ లేట్ ల సంఖ్య తక్కువ అవడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్(bacterial infection) ఉండటం వల్ల ప్లేట్ లేట్ కౌంట్ తగ్గడం చాలా సాధారణ విషయం. ఆహారం తీసుకోవడం వలన వీటిని పెంచవచ్చా? తెలుసుకుందాం.
వైరస్ వ్యాప్తి చెందే సమయంలో ఎముక మజ్జ నిర్మూలించబడుతుంది. వైరస్ ద్వారా ప్రభావం అయిన రక్త కణాలు ప్లేట్ లేట్ లను నాశనం చేయడం ఆరంభిస్తాయి. దీనివలన రక్తంలో ప్లేట్ లేట్ కౌంట్(platelate count) త్వరగా తగ్గిపోతుంది ప్లేట్ లెట్స్ పడిపోవడం వలన తీవ్రమైన డెంగ్యూ వ్యాధి లేదా హేమరేజిక్ జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ ద్వారా రక్తంలో రక్త కణాలు ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఫోలైట్ రసాయన నామం పోలిక్ యాసిడ్ . పోలేట్ లేదా విటమిన్ బి -9(vitamin B-9) ఆరోగ్యమైన రక్తకణాలకు అవసరమైనది.
పెద్దవాళ్లకు రోజులో కనీసం 400 మైక్రో గ్రాముల పోలేట్ అవసరమని వైద్యులు చెబుతున్నారు .గర్భిణీలకు 600 మైక్రో గ్రాముల వరకు అవసరం అవుతుంది . పోలేట్ లేదా విటమిన్ బి 9 మొలకలు మరియు ఆకుకూరలు, పాలకు సంబంధించిన పదార్థాలు, పండ్లు వీటిలో ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి పోలేట్ లేదా విటమిన్ బి 9 అందుతుంది.
శరీరంలో ఎర్ర రక్త కణాలు(red blood cells) తయారవ్వాలంటే విటమిన్ బి -12అవసరం. విటమిన్ బి-12((vitamin B-12) లోపం వల్ల శరీరంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది. విటమిన్ బి12 తక్కువగా ఉన్నవారికి డెంగ్యూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో పేర్కొన్నారు .
శరీరానికి విటమిన్ బి12 ఆహారం ద్వారా అందించవచ్చు. మాంసం ,చేపలు, ఆకుకూరలు, పండ్లు ,మిల్క్ ప్రొడక్ట్స్ లో విటమిన్ బి12 ఉంటుంది. ఇవి తీసుకోవడం ద్వారా విటమిన్ బి12 లోపాన్ని నియంత్రించవచ్చు.
డెంగ్యూ రోగులకు విటమిన్- సి మరియు విటమిన్ -డి కూడా అవసరం. రోగ నిరోధక శక్తి పెంచడానికి విటమిన్- సి చాలా అవసరం. విటమిన్- సి, రక్త కణాలు సరిగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఐరన్ గ్రహించే విషయంలో శరీరానికి సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడుతుంది విటమిన్ సి కూరగాయలు మరియు ప పండ్ల నుండి లభిస్తుంది. నారింజ, ద్రాక్ష ,పుల్లటి పండ్లు ,కివి పండ్లు లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మరియు బ్రోకలీ ,రెడ్ క్యాప్సికం మరియు గ్రీన్ క్యాప్సికం లో కూడా విటమిన్ సి లభిస్తుంది.
Also Read:Face Pack : మెరిసే చర్మం కోసం నాచురల్ పేస్ ప్యాక్ ..ఇప్పుడు మీ కోసం..
విటమిన్ -డి(vitamin-D) శరీరానికి లభించడం కోసం సూర్యుడు వచ్చే సమయంలో ఉండడం వల్ల విటమిన్ డి లభిస్తుంది మరియు వేరుశనగ వంటి వాటిల్లో కూడా విటమిన్ డి ఉంటుంది.
కాబట్టి డెంగ్యూ రోగులు ఇటువంటి ఆహారపు జాగ్రత్తలతో పాటు డాక్టర్ ను సంప్రదించి డెంగ్యూ వ్యాధి నుండి బయటపడండి.