Telugu Mirror: ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో మొదటి స్థానం పండ్లు(fruits) మరియు ఆకు పచ్చని కూరగాయలు(green vegetables)ఉంటాయి. పండ్లలో శరీరానికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పండ్లలో విటమిన్లు(vitamins) ,యాంటీ ఆక్సిడెంట్ల(anti oxident)తో పాటు ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి సంరక్షించడంలో ఎంతగానో తోడ్పడుతాయి.
అయితే ప్రతి పండు మీ శరీరానికి ఉపయోగపడుతుందని అనుకోవడం పొరపాటు. కొంతమందిలో అనారోగ్య కారణాల దృష్ట్యా కొన్ని రకాల పండ్లను తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన వ్యక్తులు అన్ని రకాల పండ్లను తినవచ్చు అలాగే మనకు సీజనల్ లో దొరికే పండ్లను ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాలి.
కొన్ని పండ్లలో చక్కెర ఎక్కువ మోతాదులో ఉంటుంది. అటువంటి పండ్లను డయాబెటిస్ ఉన్నవారు తీసుకోకూడదు .ఎందుకంటే వారు బరువు పెరగడంతో పాటు అనేక ఇతర రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
వైద్యులు ఏమంటున్నారంటే డయాబెటిస్(diabetes) ఉన్నవారు గ్లైసిమిక్ ఇండెక్స్ చెక్ చేసిన తర్వాత మాత్రమే పండ్లను తినాలని చెబుతున్నారు. గ్లైసిమిక్ ఇండెక్స్ అనగా ఆహారంలో కార్బోహైడ్రేట్ల స్థాయిని కొలిచే స్కేలు .ఇది రక్తంలో షుగర్ పరిమాణాన్ని ఎంత స్పీడ్ గా పెంచుతుందో కూడా చూపిస్తుంది .అయితే 55 కంటే తక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఉపయోగం అని అంటున్నారు.
ఏయే పండ్లలలో షుగర్ అధికంగా ఉంటుందో చూద్దాం . వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్(sugar levels) పెరిగే అవకాశం ఉందో లేదో తెలుసుకుందాం.
Also Read:Foods To Increase Platelets: డెంగ్యూ ఫీవర్ లో ఈ ఆహారం తో ప్లేట్ లెట్స్ పెంచు కోండి
మ్యాంగో (mango):
పండ్లలో రారాజుగా పిలిచే పండు మామిడి పండు దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ఉపయోగాలు ఇస్తుంది. దీనిలో పీచు పదార్థాలు మరియు శరీరానికి కావలసిన పోషకాలు కూడా ఉన్నాయి. కానీ ఇందులో సహజంగానే చక్కెర అధికంగా ఉంటుంది .ఒక మామిడిపండు లో 46 గ్రాముల చక్కెర ఉంటుంది .ఇది శరీరం మొత్తానికి చక్కెరను పెంచుతుంది. మరియు అధికంగా తినటం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.
అరటి పండ్లు(Banana):
అరటి పండ్లలో చక్కర మోతాదు ఎక్కువగానే ఉంటుంది .దీనిలో కూడా అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో సహాయ పడతాయి. ముఖ్యంగా శరీరంలో బలాన్ని పెంచడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. కానీ అత్తి పండ్ల ను తినడం వల్ల శరీరంలో చక్కెర పరిమాణాన్ని వేగంగా పెంచే అవకాశం ఉంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు అంజీర్ తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
ద్రాక్ష(grapes):
ద్రాక్ష పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో విటమిన్ -సి(Vitamin -c) ఉంటుంది .మరియు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి . వీటిల్లో కూడా చక్కెర స్థాయి అధికంగానే ఉంటుంది. ఒక కప్పు ద్రాక్షాలో 23 గ్రాముల చక్కెర ఉంటుంది .కాబట్టి మధుమేహం ఉన్నవారు ద్రాక్ష(grapes) తినే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు అన్ని రకాల పండ్లను హ్యాపీగా తినవచ్చు. పండ్లు తిని ఆరోగ్యంగా ఉండవచ్చు. కానీ షుగర్ ఉన్నవారు మాత్రం ఏ పండ్లలో చక్కెర శాతం తక్కువగా ఉంటుందో ఆ పండ్లను మాత్రమే తినాలి.