Black Pepper : మిరియాలలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?

Black Pepper: Did you know that pepper has so many benefits?
Image Credit : 24 Mantra

సుగంధ ద్రవ్యాలలో మిరియాల (Pepper) ను ఒకటిగా పరిగణించవచ్చు. మిరియాలను ప్రపంచవ్యాప్తంగా విరివిగా  ఉపయోగిస్తుంటారు. ఇవి ఆహారం (Food) కు మంచి రుచిని పెంపొందించడం తో పాటు ఆరోగ్యానికి (For health) ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ (Medicine) గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. వీటిని వివిధ రకాల వ్యాధుల చికిత్సకు పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు.

మిరియాలను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం :

మిరియాలను బలమైన యాంటీఆక్సిడెంట్ “స్టోర్ హౌస్” (Store House) గా పరిగణిస్తారు. ఫ్రీ రాడికల్స్ (Free radicals) వంటి ప్రమాదకరమైన వాటిని శరీరంలోకి రానివ్వకుండా అడ్డుకుంటాయి. సూర్యకాంతి కిరణాలు (Sunlight rays), సిగరెట్ పొగ, కాలుష్యం వంటి వాటికి గురైనప్పుడు శరీరం ఫ్రీ రాడికల్స్ ను విడుదల చేస్తుంది. అలాగే గుండె జబ్బులు (Heart diseases), క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. మిరియాల లో పైపరిన్ (Piperine) ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

మిరియాలు శరీరంలో వేడిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. ఇన్ఫ్లమేషన్ (Inflammation) ను తగ్గిస్తాయి. శరీరంలో కొన్నిసార్లు వివిధ భాగాల్లో వాపు వల్ల గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు (joint pains) ,డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. అటువంటి అప్పుడు మిరియాల లో ఉండే కాంపౌండ్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ న్ తగ్గించడంలో తోడ్పడతాయి. ఎలర్జీ, ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని నిర్మూలించడంలో ఉపయోగపడతాయి.

మిరియాల లో ఉండే పైపరిన్ మెదడు (Brain)  పనితీరును నియంత్రించడంలో ఉపయోగపడుతుందని అధ్యయనాలలో పేర్కొన్నారు. అల్జీమర్స్ (Alzheimer’s), పార్కిన్సన్ వంటి ఇబ్బందులు ఉన్నవారు మిరియాలను తీసుకోవడం వలన ఉపశమనం కలుగుతుంది.

మిరియాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మిరియాల లో ఉండే పైపరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ (Anti Oxidant) ఉండటం వల్ల రక్తంలో చక్కెర (Sugar) స్థాయిని నియంత్రిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

Also Read : అత్తిపండుతో అధిక బరువు హాం ఫట్..అంజీర్ చేసే లాభాలు ఇంకా మరెన్నో

విట మిన్ లు కలిగిన ఆహారం , సరైన వ్యాయామం బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఆధారం

కాబట్టి మధుమేహ (diabetes) వ్యాధిగ్రస్తులకు మిరియాలను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
మిరియాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మిరియాల లో క్రియాశీల సమ్మేళనాలు ఉండటం వలన క్యాన్సర్ (Cancer) కణాల పెరుగుదలను తగ్గిస్తుంది.

Black Pepper: Did you know that pepper has so many benefits?
Image Credit : Ayam Kita Fresh

మిరియాలలో కొలెస్ట్రాల్ (Cholesterol) ను తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయి. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడేవారు పచ్చి మిరియాలు (Raw Pepper) తినడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే వైద్యులను సంప్రదించి మాత్రమే వీటిని తీసుకోవాలి.

Also Read : Restaurant Taste : వంటలలో ఈ పదార్ధాలను వాడండి కూరలో చిక్కదనం,టేస్ట్ లో కమ్మదనం పొందండి

కాబట్టి మిరియాలలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వలన మిరియాల ను తరచుగా (Regular) అందరూ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.

గమనిక : ఈ కథనం జ్ఞానం మరియు అవగాహన పెంచడానికి తయారు చేయబడింది. పూర్తి సమాచారం కోసం మీ వైద్యుడుని  సంప్రదించండి.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in