Telugu Mirror: ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుండి ఏడు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుతుంటారు. ఎందుకనగా నవజాత శిశువులకు తల్లి పాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం వారోత్సవాలను జరుపుకుంటారు. పిల్లల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరం. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల్లో చక్కటి ఎదుగుదల కనిపిస్తుంది. అప్పుడే జన్మించిన బిడ్డకు అవసరమైన మరియు అన్ని పోషకాలు తల్లిపాలలో ఉంటాయి. ఇవి అప్పుడే పుట్టిన శిశువులకు ఉత్తమం అని అధ్యయనాలు అంటున్నాయి.
డెలివరీ అయిన తర్వాత మొదటగా వచ్చే చిక్కని మరియు పసుపు రంగులో ఉండే పాలు అమృతంతో సమానం. ఇవి పిల్లల మానసిక మరియు శారీరక వికాసానికి తల్లిపాలు అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పుట్టిన సమయం దగ్గర నుండి 6 నెలలు వచ్చేవరకు ప్రతిరోజు తల్లిపాలు శిశువుకు అందేలా చూడాలని వైద్యులు చెబుతున్నారు. తల్లి పాలల్లో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అవి నవజాత శిశువులకు మెదడు ఎదుగుదలపై మంచి ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు కనుగొన్నారు. టఫ్స్ట్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తల్లిపాలు నవజాత శిశువుల ఆరోగ్యంపై కలిగే ప్రభావం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డలు ప్రతిరోజు తల్లిపాలు తాగడం వలన అలాగే తల్లిపాలల్లో ఉండే పోషకాలు మెదడు ఇబ్బందులను నియంత్రించడంలో ఎంతగానో తోడ్పడతాయని గుర్తించారు. క్రమం తప్పకుండా తల్లిపాలు తాగే పిల్లలు మరియు తల్లిపాలు లేని పిల్లలకంటే అధిక మేధాభివృద్ది మరియు చురుకుదనాన్ని కలిగి ఉంటారు.
బ్రెస్ట్ ఫీడింగ్(breast feeding) ప్రారంభ నెలలో తల్లిపాలల్లో ఉండే సూక్ష్మ పోషకాలు బ్రెయిన్ డెవలప్మెంట్ కు ఉపయోగపడతాయి అని ప్రొఫీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో పేర్కొన్నారు. ఇవి బ్రెయిన్ లోని న్యూరాన్ల కనెక్షన్లను ఇంప్రూవ్ చేయడంలో తోడ్పడతాయి. తద్వారా భవిష్యత్తులో నరాల సంబంధిత ఇబ్బందులను నియంత్రించడంలో ప్రత్యేక ఉపయోగాలను పొందవచ్చు.
న్యూరో సైన్స్(science) మరియు ఏజింగ్ టీం లోని సీనియర్ శాస్త్రవేత్త మరియు అధ్యయన రచయిత అయిన థామస్ బైడెరర్ ఏమంటున్నారంటే బాల్యం ప్రారంభ దశలో మెదడు పనితీరు ముఖ్యంగా ఆహారంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. బ్రెస్ట్ మిల్క్(breast milk) ఎంతో సుసంపన్నం అని తెలిసి ఆశ్చర్యంగా ఉంది అని బైడెరర్ అంటున్నారు.
ఇది మెదడు అభివృద్ధి యొక్క వివిధ అంశాలకు సహాయం చేయడంలో నవజాత శిశువులకు తల్లిపాలు చాలా ముఖ్యమని భావించేలా చేస్తుంది అన్నారు. తల్లి పాలు పట్టడం సాధ్యం కాని బిడ్డలకు మయో -ఇనోసిటాల్ ఇవ్వాలని ఈ పరిశోధన సూచిస్తుందని బ్రెస్ట్ ఫీడింగ్ పరిశోధన ప్రొఫెసర్ బైడెరర్ తెలిపారు.
అయితే వాటి పనితీరు యొక్క బాహ్య ప్రభావం గురించి ఇంకా తెలియలేదు కాబట్టి సాధ్యమైనంతవరకు ప్రతి శిశువుకు ఆరోగ్యపరమైన రక్షణ ఇవ్వాలి. కాబట్టి తల్లిపాలు తప్పనిసరిగా అందించాలి. బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి కూడా ఈ ఉపయోగాల గురించి చెప్పి వారికి పాలు ఇచ్చేలా చేయాలి.