Telugu Mirror: ప్రస్తుత రోజుల్లో అస్తవ్యస్త జీవన విధానం మరియు తెలిసీ తెలియక చేసిన పొరపాట్ల కారణంగా మానవుల్లో వివిధ రకాల మానసిక మరియు శారీరక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. పూర్వకాలంలో వృద్దాప్యం వచ్చిన వాళ్లకు మాత్రమే వినికిడి లోపం మరియు కళ్ళు మసక బారడం లాంటి సమస్యలు వచ్చేవి .కానీ ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది.
గంటల కొద్దీ ఫోన్లలో పాటలు వినడం మరియు ఫోన్లు మాట్లాడటం వల్ల వినికిడి సామర్థ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. వార్తా కథనాల ప్రకారం ఇండియా(india)లో వినికిడి లోపం ఉన్న వారి సంఖ్య 63 మిలియన్లకు చేరువులో ఉంది .
జీవన విధానంలో మార్పులు మరియు పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఈ సంఖ్య ఎక్కువ అవ్వడానికి కారణం అవుతుందని వైద్యులు అంటున్నారు.
దేహంలోని చాలా సెన్సిటివ్(sensitive)భాగాలో చెవులు ఒకటి .చెవుల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే వినికిడి సామర్థ్యం దెబ్బతింటుంది. మనుషుల్లో కొన్ని తప్పుడు ఆహారపు అలవాట్లు ఉండడం వల్ల గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రజలు వినికిడి శక్తిని కోల్పోతున్నారు. అటువంటి సందర్భంలో వినికిడి లోపం రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
అవేమిటో చూద్దాం:
పొగ త్రాగే వారి ఆరోగ్యం హానికరంగా ఉంటుంది. పొగ త్రాగడం వలన ఊపిరితిత్తులు(lungs)మరియు గుండె(heart)పై ప్రభావం చూపడమే కాకుండా చెవుల మీద కూడా ప్రభావం పడుతుంది. అధ్యయనాల ప్రకారం సిగరెట్ల(cigarette)లో ఉండే నికోటిన్ చెవులలో రక్తప్రసరణ మీద ప్రభావం పడుతుం. ఇది చెవిలోని సున్నితమైన భాగాలను హాని చేస్తాయి. నివేదికల ప్రకారం పాసివ్ స్మోకింగ్ కి గురైన వారిలో వినికిడిలోపం ఎక్కువగా ఉంటుంది అని కనుగొన్నారు. స్మోక్ చేయడం వల్ల టిన్సీటస్ అనగా చెవులు రింగింగ్ సమస్య కూడా అధికమవుతుంది.
నేటి కాలంలో హెడ్ ఫోన్స్(head phones) మరియు ఇయర్ ఫోన్స్(ear phones)అధికంగా ఉపయోగించడం వల్ల వినికిడి లోపం వస్తుంది. పాటలు వినడం ద్వారా మరియు చెవుల్లో ఎప్పుడు ఇయర్ ఫోన్లు పెట్టుకొని ఉండడంవల్ల శబ్దం ఎక్కువ మోతాదులో చెవులకు చేరుతుంది .హెడ్ ఫోన్స్ మరియు ఇయర్ ఫోన్స్ తరచుగా వాడాల్సి వస్తే 60 శాతం లేదా అంతకన్నా తక్కువ సౌండ్ లో మాత్రమే వినాలి.
మీరు తరచుగా ఇయర్ బడ్స్(ear buds) తో చెవులను క్లీన్ చేస్తున్నట్లయితే అవి మీ చెవులను శుభ్రం చేస్తుంది కానీ అది మీ వినికిడి శక్తిని దెబ్బతీస్తుంది. ఇయర్ బడ్స్ వాడటం మరియు అజాగ్రత్తగా వాడటం చాలా ప్రమాదకరం. దీనివలన చెవిలో రంద్రం ఏర్పడే అవకాశం ఉంటుంది. తద్వారా వినికిడి లోపం వస్తుంది కాబట్టి చెవులను సొంతంగా శుభ్రం చేయడం ఆపేయాలి.
కొంతమందికి చెవి నొప్పి లాంటి సమస్యలు ఉంటాయి. కానీ వారు దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వీరికి చెవులు చాలా ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది . చెవి సమస్యలు ఉంటే మీరు వైద్యుడి(Doctor)ని సంప్రదించాలి మీరు సొంతంగా వైద్యం ఏది చేయకూడదు.
కాబట్టి చెవి సమస్యలను తేలికగా తీసుకోకుండా సకాలంలో వైద్యుడిని సంప్రదించవలెను.