Cheela Breakfast Recipe : చక చకా బ్రేక్ ఫాస్ట్ కోసం చిల్లా రెసిపీ..ఆరోగ్యంతో పాటు సమయం కూడా ఆదా.. తయారీ విధానం తెలుసుకోండిలా..

Telugu Mirror : సోమవారం రాగానే చాలామంది ఆఫీస్ కి వెళ్లే హడావిడిలో ఉంటారు. పిల్లలకు పెద్దలకు టిఫిన్(Tiffin) తయారు చేయాల్సి వస్తుంది చాలా మంది మహిళలు ఇంటి పని చేసుకొని ఆఫీస్ కు వెళ్లేవారు ఉంటారు. అటువంటి సందర్భంలో పొరపాటున ఉదయం లేవడం ఆలస్యం అయితే అల్పాహారాన్ని చేయడం ఆపేస్తారు. బ్రేక్ ఫాస్ట్(Break Fast) తయారు చేయడానికి టైం పడుతుందన్న ఉద్దేశంతో లంచ్(Lunch) తయారు చేసుకుని టిఫిన్ చేయకుండా వెళతారు.అయితే ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా అవసరం. ఉదయం అల్పాహారం మన శరీరానికి చాలా ముఖ్యం. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల శరీరం ఎనర్జీతో నిండి ఉంటుంది.

Hydra Facial : హైడ్రా ఫేషియల్ తో రెట్టింపు సౌందర్యం మీ సొంతం..మరి తీసుకునే జాగ్రత్తల సంగతి ఏంటి? 

అటువంటి పరిస్థితులలో ఈరోజు మేము మీకు కేవలం పది నిమిషాలలో తయారుచేసే బ్రేక్ ఫాస్ట్(Break Fast) గురించి చెబుతున్నాం . ఈ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ పేరు చిల్లా(Chilla). దీనిని మినప్పప్పు లేదా శెనగపిండి తో కాకుండా గోధుమ పిండితో తయారు చేస్తారు. గోధుమపిండితో తయారు చేయబడిన ఈ చిల్లా ఆరోగ్యానికి కూడా మంచిది. గోధుమ పిండిలో ప్రోటీన్(Protein) మరియు ఫైబర్ ఉండటం వలన మీ పొట్టను నింపుతుంది. దీనిలో వాడే కూరగాయలు మీ శరీరానికి అవసరమైన ఖనిజాలు మరియు విటమిన్లను అందిస్తాయి. కాబట్టి మీరు ఉదయాన్నే గోధుమపిండితో చేసిన చిల్లాను 10 నిమిషాలలో తయారు చేసుకుని అందరూ హ్యాపీగా తినవచ్చు.

Image Credit : Lokmat News Hindi

దీనికి కావలసిన పదార్థాలు :

గోధుమపిండి, ఉప్పు ,పెరుగు, ఒరే గానో, అల్లం, క్యాప్సికం, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాజా తరిగిన కొత్తిమీర, పసుపు

తయారీ విధానం :

గోధుమపిండి(wheat Floor)తో చిల్లా తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి దీనిలో సరిపడినంత ఉప్పు చిటికెడు పసుపు మరియు పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత నీళ్లు పోసి పిండిని దోశ పిండి లాగా జారుగా కలపాలి. పిండి సిద్ధం అయ్యాక దీనిలో సన్నగా తరిగిన క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి, బీన్స్, క్యాప్సికం, ఉల్లిపాయ, కొత్తిమీర అన్నింటిని పిండిలో వేసి కలపాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. పాన్ వేడయ్యాక కొద్దిగా నూనె వేయాలి. తర్వాత పిండిని గరిటతో దోశ లాగా వేయాలి. పిండి చుట్టూ నూనె వేస్తూ రెండు వైపులా దోరగా కాల్చాలి. చిల్లా రెడీ.దీనిని గ్రీన్ చట్నీ లేదా కెచప్ తో తింటే చాలా బాగుంటుంది.

కాబట్టి ఉదయం లేవడం ఆలస్యం అయ్యిందని ఆందోళన పడకుండా చాలా సులువుగా పది నిమిషాలలో ఈ అల్పాహారమును తయారు చేసుకొని తినవచ్చు.

Leave A Reply

Your email address will not be published.