Collagen : ఆరోగ్యకరమైన పోషణకు కొల్లాజెన్ ప్రోటీనే మూలం.. పనితీరు తెలిస్తే షాకే..
Telugu Mirror : మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే వివిధ రకాల విటమిన్లు మరియు ప్రోటీన్లు అవసరం . కొల్లాజెన్(Collogen) అనేది ప్రోటీన్లలో ఒకటి. ఇది మన శరీరంలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. మన దేహంలో కొల్లాజెన్ సహజంగానే తయారవుతుంది. అయితే కొల్లాజెన్ ఎలా పని చేస్తుందో మరియు శరీరంలో దాని యొక్క పాత్ర ఏమిటంటే, శరీరం మొత్తానికి బలాన్ని మరియు నిర్మాణాన్ని అందిస్తుంది అలాగే చర్మాన్ని(Skin) మరియు జుట్టును కూడా ఆరోగ్యకరంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్య పాత్రను కలిగి ఉంటుంది.కాలం గడిచే కొద్దీ దేహం(Body)లో కొల్లాజెన్ పరిమాణం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది తగ్గిపోవడానికి వయసు మాత్రమే కారణం కాదు. దేహంలో కొల్లాజెన్ లోపం ఉండటం వల్ల, మరికొన్ని ఇతర కారణాలు ఉండటం వలన కొల్లాజెన్ స్థాయి తగ్గిపోతుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
మన శరీరానికి అవసరమైన ప్రోటీన్(Protein) 30 శాతం కొల్లాజెన్ లో ఉంటుంది. కండరాలు, ఎముకలు, చర్మం మరియు బంధన కణజాలాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా అవసరం. సంపూర్ణ ఆహారం తీసుకోవడం ద్వారా శరీరం మొత్తానికి కొల్లాజెన్ ను అందించవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.కొల్లాజెన్ లోపం శరీరం లో దేనివల్ల వస్తుందో తెలుసుకుందాం. మూడు రకాల కారణాల వల్ల కొల్లాజెన్ శరీరంలో తగ్గుతుంది.వయసు పైబడిన(Aged People) వారిలో కాకుండా మిగిలిన వారి శరీరంలో కొల్లా జెన్ పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయని పరిశోధనలో తేలింది.
చక్కెరను ఎక్కువగా తీసుకోవడం మరియు పొగ త్రాగడం(Smoking),సూర్యరశ్మి వీటి యొక్క ప్రభావం శరీరంపై అధికం అయినప్పుడు కొల్లాజెన్ లోపం ఏర్పడుతుంది.సూర్యుడు నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలు(Ultraviolet metallic rays) శరీరానికి నేరుగా తగలడం వల్ల కొల్లాజెన్ లోపం ఏర్పడుతుంది. సిగరెట్(Cigarette) పొగలో ఉండే రసాయనాలు కూడా కొల్లాజన్ కు హాని కలిగిస్తాయి. దీనివల్ల చర్మం లూజుగా అవుతుంది. మరియు ముడతలు వస్తుంది.చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కొల్లాజెన్ చాలా అవసరం. కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల చర్మ యొక్క ముడతలను తగ్గించడంలో సహాయపడుతుందని 2022 లో చేసిన పరిశోధనలో నిర్ధారించారు.
కొల్లాజెన్ లోపం వల్ల చర్మంపై అకస్మాత్తుగా వృద్ధాప్య సంకేతాలు కనిపించే అవకాశం ఉంది.బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అధ్యయనంలో కొల్లాజెన్ సప్లిమెంట్ల(supplement)ను ఉపయోగించడం వల్ల చేతి,తుంటి లేదా మోకాలు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వారికి మూడు నెలల్లో నొప్పి తగ్గిపోతుంది అని కనుగొన్నారు. అయితే దీని యొక్క సప్లిమెంట్ల ప్రభావం తెలుసుకోవడానికి మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. కొల్లాజెన్ సప్లిమెంట్ రూపంలో లభిస్తుందని పరిశోధనలో తేలింది. అయితే ఆహారం ద్వారా శరీరం మొత్తానికి అందేలా శ్రద్ధ తీసుకోవాలి.
మాంసాహారం(Non-Veg) తీసుకోవడం వల్ల శరీరానికి అందుతుంది. అయితే మాంసాహారంలో రెడ్ మీట్(Red meat) అధికంగా తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. కొల్లాజెన్ ను సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం అందరికీ ఉపయోగకరం కాదు వైద్యుల సలహాతో మాత్రమే వాడాలి.కాబట్టి ఏ లోపం ఉన్న శరీరానికి హాని రాకుండా ఉండాలంటే పౌష్టికాహారం ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.