Parota Recipe : పరిపూర్ణమైన పరోటా తయారీ విధానంతో తృప్తిగా ఆరగించండి ఇలా.

Telugu Mirror : భారతీయులు ఎక్కువగా వండే వంటకాలలో పరాటా(parota) ఒకటి. చాలామంది ప్రజలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ మరియు మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం సమయంలో పరాటాలు తినేందుకు ఇష్టం చూపిస్తారు. అలాగే స్టఫ్డ్ పరాటాలు కూడా చాలామంది ఇష్టపడతారు. ఆలు పరాటాలు, పన్నీర్, పప్పు,ముల్లంగి, ఉల్లిపాయలు, బచ్చలి కూర ఇలా మొదలైన అనేక రకాల స్టఫ్డ్ పరాటాలు తయారు చేయవచ్చు. వీటి రుచి చాలా బాగుంటుంది. కానీ స్టఫ్డ్ పరాటాన్ని తయారు చేయడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. పిండిలో స్టఫ్ చేసిన పదార్థం ఒక్కొక్కసారి బయటికి వచ్చి పరాటా చెడిపోతుంది.

Protein Powder : సహజమైన పద్దతిలో ప్రోటీన్ పొడి తయారీ, ఇక పై శరీరానికి రెట్టింపు శక్తి

అలాగే ఒక్కొక్క సందర్భంలో రోలింగ్(rolling) చేసేటప్పుడు మసాలా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి మధ్యలో మందంగా అయిపోతుంటుంది. ఇలాంటి సందర్భంలో పరాటాలు అంత పర్ఫెక్ట్ గా రావు. అయితే ఇవాళ మీకు మేము సగ్గుబియ్యం స్టఫ్ తో పరాటాలు పర్ఫెక్ట్ గా రావాలంటే కొన్ని టిప్స్ తెలియజేస్తున్నాం. కొన్ని పద్ధతులు పాటించినట్లయితే మంచి రుచికరమైన మరియు మృదువైన స్టఫ్డ్ పరాటాలు తయారు చేసుకొని హ్యాపీగా తినవచ్చు. మరియు రోలింగ్ చేసే సమయంలో పరాటా విరిగిపోదు. అలాగే మసాలా బయటకి రాదు. కాబట్టి ఆ పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం.

Image Credit : Samayam telugu

Role Of Aspirin: రెండవ సారి హార్ట్ స్ట్రోక్ నివారణలో ఆస్పిరిన్ పాత్ర

  • సగ్గుబియ్యం స్టఫ్డ్ పరాటా చేయడానికి పిండిని కలిపేటప్పుడు పిండిని కొద్దిగా గట్టిగా కలపాలి. పిండిని గట్టిగా కలపడం వలన పరాటా మంచిగా మరియు మృదువుగా వస్తుంది.
  • పరాటా చేసే పిండిలో సగ్గుబియ్యం స్టఫ్ చేయాల్సి వచ్చినప్పుడు అంచులు మరియు మధ్యలో మందంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల రోలింగ్ చేసేటప్పుడు మసాలా బయటకు రాదు.
  • సగ్గుబియ్యంతో పరాట చేసినప్పుడు చేతులతో తేలికగా చేయాలి. స్టఫింగ్ తో పిండిని రోలింగ్ చేసేటప్పుడు పిండికి రెండు వైపులా పిండిని ఉపయోగించాలి దీని వలన పరాటాలు చుట్టడం తేలిక అవుతుంది.
  • సగ్గుబియ్యం పరాటా చేస్తున్నప్పుడు సగ్గుబియ్యంలో ఉప్పు తక్కువగా వేయండి. ఎందుకంటే ఉప్పు నీటిని విడుదల చేస్తుంది. దీనివలన స్టఫింగ్ లో అదనపు పిండిని తడిగా చేస్తుంది మరియు రోలింగ్ చేసేటప్పుడు విరిగిపోతుంది.
  • పరాటాలో సగ్గుబియ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం వలన సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి పిండిని రోల్ చేస్తారు. దీని వలన పరాటా విరిగిపోతుంది. ఒకవేళ మీరు స్టఫింగ్ ఎక్కువ పెడితే చేతులను ఉపయోగించి పరాటాను చేయండి.
  • చేతులతో నొక్కి పరాటాలు చేసిన తర్వాత కొద్దిగా పిండిని చల్లి రోలింగ్ పిన్ తో ఒకసారి రుద్దండి. ఇలా చేయడం వల్ల పరాటా చిరిగిపోదు. స్టఫింగ్ పరాటాను రోల్ చేసేటప్పుడు గట్టిగా రుద్దుతూ చేయకూడదు. విరిగిపోయే అవకాశం ఉంటుంది.

కాబట్టి సగ్గుబియ్యంతో స్టఫ్డ్ పరాటా చేస్తున్నప్పుడు ఇటువంటి కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పరాటాలు విరిగిపోకుండా మృదువుగా రుచికరంగా ఉంటాయి.

Leave A Reply

Your email address will not be published.