Telugu Mirror : శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పోషకాహారాం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే మీరు తీసుకునే ఆహారం నుండి అవసరమైన మరియు శరీరానికి కావాల్సిన అన్ని అంశాలను పొందుతున్నారా? ఎందుకనగా ప్రపంచ వ్యాప్తంగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా విటమిన్ సప్లిమెంట్ బాగా అధికం అయిందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ ప్రశ్న మొదలైంది?
అంటే దీని అర్థం మనం తీసుకునే ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. దీనికి సంబంధించిన ఒక అధ్యయనం ప్రకారం, శాఖాహార ఆహారాన్ని తీసుకునే వారు ఒమేగా-3(Omega-3) పోషకాల లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు . గుండె సంబంధిత వ్యాధులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో మరియు రక్త పోటును నియంత్రించడంలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్(Omega-3 Fatty Acids) అవసరం అని అధ్యయనాలు పేర్కొన్నాయి. దీని లోపం వలన బలహీనతతో పాటు, నిద్ర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి శాఖాహారులు ఆహారం ద్వారా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పొందే ప్రయత్నం చేయాలి.
Effects of Tea : మీరు ‘టీ’ తాగుతున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే ..
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యం. మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైన లాంగ్- చైన్(Long-Chain), ఒమేగా -3 కొవ్వు ఆమ్లం ఆల్ఫా లినో లెనిక్ యాసిడ్ (ఏ ఎల్ ఏ) శరీరానికి సహజంగా అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఇది మాంసాహారం ద్వారా శరీరానికి సులభంగా అందుతుంది .ఒకవేళ మీరు శాఖాహారులు అయితే మీ ఆహారంలో కొన్ని పదార్థాలను తప్పకుండా చేర్చుకోవాలి. వాటి ద్వారా మీరు ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలను తేలికగా పొందవచ్చు. అటువంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్(Omega Three Fatty Acids) అనేక ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయని నిపుణులు వెల్లడించారు. చేపలు మరియు గింజలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. మీ శరీరం మరియు మెదడుకు అనేక రకాల ఉపయోగాలను అందిస్తుంది.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మొక్కలకు సంబంధించిన ఆహారాల నుండి లభిస్తాయి. రోజువారి ఆహారంలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మగవారికి 1600 మిల్లి గ్రాములు మరియు ఆడవారికి 1100 మిల్లీగ్రాములు అవసరం అవుతుంది. వేటి ద్వారా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పొందవచ్చో చూద్దాం.
MakeUP Tips : పండుగ సమయం లో లైట్ మేకప్ తో బ్రైట్ ముఖం మీ సొంతం..ఈ టిప్స్ పాటించండి
చియా సీడ్స్ :
చియా గింజలలో శరీరానికి కావలసిన అనేక రకాల ఆరోగ్య ఉపయోగాలు దాగి ఉన్నాయి అని అధ్యయనాలు అంటున్నాయి. వీటిల్లో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్(Protein) మరియు ఫైబర్ కూడా ఉన్నాయి. ఆహారంలో భాగంగా చేర్చడం వల్ల శరీరానికి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలను సులభంగా అందించవచ్చు అని వైద్యులు అంటున్నారు.
వాల్ నట్స్ :
వాల్ నట్స్(Wal Nuts) లో కూడా ఒమేగా త్రీ(Omega Three) కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఒక కప్పు వాల్ నట్స్ లో 3.346 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. మెదడు మరియు గుండె సంబంధిత ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వాల్ నట్స్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది . ప్రతిరోజు వాల్ నట్స్ తినేవారిలో మెదడు సమస్యలు వచ్చే అవకాశం తక్కువ అని పరిశోధనలో పేర్కొన్నారు.
కాబట్టి శాఖాహారులు చియా సీడ్స్ మరియు వాల్ నట్స్ ఆహారంలో భాగంగా చేర్చుకొని సులభంగా శరీరానికి ఒమేగా త్రీ ఆమ్లాలను అందించవచ్చు.