Telugu Mirror : ప్రపంచవ్యాప్తంగా అందరికి ఇష్టమైన పానీయాలలో టీ(Tea) ఒకటి. టీ త్రాగడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమా? లేదా హానికరమా ?అనే విషయం గురించి చాలా కాలం నుండి చర్చించబడుతుంది. అయితే కొన్ని అధ్యయనాలు ప్రకారం, మితంగా టీ తీసుకోవడం వల్ల శరీరానికి ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు.అయినప్పటికీ టీ ని ఎక్కువసార్లు త్రాగడం వలన అనేక ఆరోగ్య సమస్యలను పెంచే అవకాశం ఉంది. రోజు అధిక మొత్తంలో టీ తాగే వారికి నిద్ర సమస్యలు, ఆందోళన, తలనొప్పి వంటి చెడు ప్రభావాలకు లోనవుతారు.
టీ లో ఉండే కొన్ని సమ్మేళనాలు శరీరంలోని కొన్ని పోషకాలను గ్రహించడంలో ప్రభావితం చేస్తాయని అధ్యయనాలలో తేలింది .వాటిలో ముఖ్యమైనది ఐరన్(Iron). ప్రతిరోజు అధిక మొత్తంలో టీ తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకుందాం. దీని గురించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
Tips for glowing Skin : నాచురల్ చిట్కాలతో సహజసిద్ధముగా మెరిసే చర్మం మీ సొంతం..
టీ ని ఎక్కువగా త్రాగడం వలన శరీరంలోని ఇనుము పై దాని ప్రభావం పడుతుంది టీ లో టానిన్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉన్నాయని పరిశోధనలో పేర్కొన్నారు. టానిన్లు, కొన్ని రకాల ఆహారాల తో ఇనుమును బంధిస్తాయి. కాబట్టి ఇది జీర్ణ వ్యవస్థలో ఇనుమును గ్రహించేలా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల శరీరంలో ఐరన్ లోపిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. దీని వలన అలసట తో పాటు బలహీనంగా అనిపించడం మరియు అనేక రకాల ఇతర సమస్యలు రావచ్చు. కాబట్టి ఐరన్ లోపం ఉన్నవారు టీ త్రాగటాన్ని తగ్గించాలి.
సాధారణంగా టీ లో కెఫిన్ ఉంటుంది. కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు నిద్ర మేలుకునే చక్రానికి భంగం వాటిల్లుతుంది. కెఫిన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుందని దీని ఫలితంగా నిద్ర నాణ్యత లోపిస్తుందని పరిశోధకులు అంటున్నారు. మెలోటోనిన్ అనేది మీ మెదడుకు నిద్రపోయే సమయం అని సూచించే హార్మోన్. సరైన నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి.
గర్భధారణ సమయంలో పోషకాహారం తప్పనిసరి..లేకపోతే జరిగే ప్రమాదం తెలుసా?
టీ లో ఉండే కెఫిన్ వల్ల మీకు గుండెల్లో మంట, వంటి ఇబ్బందులు ప్రారంభమవుతాయి. కెఫిన్ పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని అధికం చేస్తుందని ఇది యాసిడ్ రిఫ్లెక్స్ మరియు గుండెల్లో రిఫ్లెక్స్ కు దారి తీస్తుందని పరిశోధకులు వెల్లడించారు .తరచుగా గుండెల్లో మంట లేదా కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు టీ అధికంగా త్రాగడం వలన వాటి యొక్క లక్షణాలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని అధ్యయనాలో కనుగొనబడింది.
గర్భిణీ స్త్రీలు(Pregnant ladies) టీ లేదా కెఫిన్ వంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన గర్భస్రావం మరియు పుట్టబోయే బిడ్డ బరువు కు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే గర్భధారణ సమయంలో కెఫిన్(Caffeine) వల్ల వచ్చే సమస్యలపై సరైన స్పష్టత లేదు. అలాగని ఎంత సురక్షితమో ఇప్పటికీ క్లియర్ గా తెలియలేదు.అయితే మీరు రోజువారి భాగంలో కెఫిన్ వినియోగం 200 నుంచి 300 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఇబ్బందులు ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
కాబట్టి ఐరన్ లోపం ఉన్నవారు మరియు ఇప్పటికే గుండె మంట మరియు కడుపులో సమస్యలు ఉన్నవారు కెఫిన్ మోతాదును చాలా వరకు తగ్గించడం మంచిది.