Telugu Mirror : మనలో చాలామంది నడుము నొప్పి(Back Pain)తో బాధపడుతూ ఉంటారు. నడుము నొప్పి అనేది సాధారణ సమస్య. జీవన విధానం లో ఇబ్బందులు ఉండటం వల్ల దీని ప్రమాదం పెరుగుతుంది. సరైన పద్ధతిలో కూర్చోకపోవడం ,దెబ్బలు తగిలినప్పుడు మరియు పడుకునే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్య రావడం చాలా సాధారణంగా జరుగుతుంటుంది అని వైద్యులు అంటున్నారు.అయితే యువత(Youth)లో ఈ సమస్య చాలా వేగంగా విస్తరిస్తుంది .కానీ కొన్ని పరిస్థితులు తీవ్రమైన వ్యాధులు గుర్తుగా కూడా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.
Good News For TSRTC: కొన్ని వేల మంది శ్రమకు దక్కిన గౌరవం..రాష్ట్ర ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం
కాబట్టి దీనిని నిర్లక్ష్యం(neglect) చేయకూడదని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.30 నుంచి 40 వయసులో ఉన్న వారిలో ఎక్కువ మంది వెన్ను నొప్పి సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు అంటున్నారు. జీవన విధానంలో మార్పులు ఉండటం వలన ఈ సమస్య ఎక్కువ అవుతుందని నిపుణులు అంటున్నారు .నడుము నొప్పి తరచుగా కొనసాగుతూ ఉంటే క్యాన్సర్ సంకేతం అని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నారు. నిజంగానే నడుము నొప్పి ఉన్నవారికి క్యాన్సర్(Cancer) వచ్చే అవకాశం ఉందా? దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
వీపు కింది భాగంలో నొప్పి సాధారణ సమస్య అయినప్పటికీ మనం ఏమీ చేయకుండానే దానంతట అదే తగ్గిపోతుంది. అయితే క్యాన్సర్ విషయానికి వస్తే ఇటువంటి కొన్ని లక్షణాలు(Symptoms)అంతర్లీనంగా ఆరోగ్య ప్రమాదాలలో కూడా కనిపించే అవకాశం ఉంది. అంటే మీరు దీర్ఘకాలంగా నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నా మరియు ఏదైనా చికిత్స తీసుకున్నాక కూడా నొప్పి వచ్చినా మరలా ఎందుకు వస్తుంది అనే కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్(Doctor) ను తప్పకుండా సంప్రదించాలి.
క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల లో కనిపించే సాధరణ సమస్య వెన్నునొప్పి(Back Pain). క్యాన్సర్ ఎక్కువ అవ్వడం లేదా మెటాసిస్కు మెటోస్టాసిస్ కు గుర్తుగా మీకు నడుము నొప్పి ఉండే అవకాశం ఉంది. వైద్యులు ఏమంటున్నారంటే ఊపిరితిత్తులు, వృషణాలు(testicles), రొమ్ము మరియు పెద్ద ప్రేగు ఈ నాలుగు రకాల క్యాన్సర్లు వెనుకకు వ్యాప్తి చెంది అవకాశముంటుంది. అలాగే ఇలాంటి సమయంలో నడుము నొప్పి యొక్క తీవ్రత గణనీయంగా పెంచుతాయి. ఇటువంటి సందర్భంలో మీరు క్యాన్సర్ కు సంబంధించిన పలు రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
Today Rashi Phalam: నేటి రాశి ఫలం, డైలీ జాతకం 01-ఆగష్టు-2023
అధ్యయనాల ప్రకారం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన వారిలో 25 శాతం మంది నడుము నొప్పి ఉందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. క్యాన్సర్ రీసెర్చ్ యూకే(UK) వారి ప్రకారం లంగ్ క్యాన్సర్(Lung Cancer) ఎముకలకు వ్యాప్తి చెందితే వెన్నునొప్పి వస్తుందని అంటున్నారు.ఈ నడుము నొప్పి లంగ్ క్యాన్సర్ యొక్క ఇతర లక్షణాలలో కలిసి ఉంటుంది. కాబట్టి దీనికి మీరు చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకొని వైద్యం చేయించుకోవాలి.లంగ్ క్యాన్సర్ లక్షణాల్లో మీకు రాత్రిపూట చెమటలు(Sweat) రావడం, జ్వరం మరియు మూత్ర సమస్యలు రావడం బరువు బాగా తగ్గిపోవడం(Weight Loss) లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
నడుం నొప్పి ఉన్న ప్రతిసారి క్యాన్సర్ అని చెప్పక తప్పదని వైద్యులు అంటున్నారు. మందులు, స్ట్రెచింగ్(Stretching) వంటి వాటితో పాటుగా శరీర భంగిమలు సరిగా ఉండడం వలన నడుము నొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు. అయితే లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వెంటనే వైద్యులను సంప్రదించాలి.సాధారణంగా వెన్నునొప్పి వలన క్యాన్సర్ రాదు అయితే ఇది దీర్ఘకాలం కొనసాగడం మరియు చికిత్స తీసుకున్నా కూడా తగ్గకపోతే అప్పుడు తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి లేదంటే చాలా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.