Telugu Mirror: ఆరోగ్యకరమైన శరీరం మరియు మనసుకు యోగాసనం చాలా బాగా పనిచేస్తాయి. యోగ(yoga)చేయడం వల్ల మానసిక మరియు శారీరక సమస్యల నుండి తేలికగా బయటపడే అవకాశం ఉంది. యోగా(yoga)చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. యోగా చేయడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది .అలాగే జలుబు మరియు ఫ్లూ(flu)వంటి వాటి నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా పెద్దపెద్ద వ్యాధులలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది .తరచుగా యోగా చేయడం ద్వారా శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచవచ్చు.
సరిగ్గా లేని జీవన విధానం కారణంగా చిన్న వయసులోనే కంటిచూపు మరియు జుట్టు రాలిపోవడం సమస్యలు ఇంకా వేరే ఇతర సమస్యల నుండి కూడా కాపాడుతుంది .యోగ చేయడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే వాటిని తప్పుగా చేసిన లేదా యోగాకు ముందు మరియు తర్వాత చేసే కొన్ని పనుల వల్ల శరీరంపై చెడు ప్రభావం పడుతుంది.
దీని గురించి సరైన అవగాహన లేకుండా చేయకూడదు. అలా చేస్తే కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. చాలామంది యోగ చేస్తారు కానీ అనారోగ్యానికి గురవుతుంటారు. దీనికి కారణం యోగ సాధన పై సరైన అవగాహన లేకపోవడం.సరిగా యోగ సాధన తప్పుగా చేస్తే శరీరానికి హాని కలుగుతుందని ప్రజలు తెలుసుకోవాలి. యోగ సాధన చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
1. యోగా చేసిన వెంటనే నీళ్లు త్రాగరాదు .నీళ్లు త్రాగటం వల్ల గొంతులో కఫం ఏర్పడుతుంది . ఇలాంటప్పుడు వెంటనే కాకుండా కొంత సమయం తర్వాత మాత్రమే నీళ్లు తాగితే మంచిది.
2. యోగా చేసిన వెంటనే స్నానం చేయరాదు. ఎందుకనగా యోగా చేసినప్పుడు శరీరంలో చాలా క్యాలరీలు(calories)ఖర్చవుతాయి. మరియు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది .వెంటనే స్నానం చేయడం వల్ల జలుబు మరియు ఫ్లూ వంటి సమస్యలు వస్తాయి.
3. యోగా చేసిన వెంటనే ఆహారం తీసుకోకూడదు. కనీసం 30 నిమిషాలు ఆగాలి . అతిగా కూడా తినకూడదు. తేలకపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. యోగ చేసే ముందు కూడా ఆహారం తీసుకోకూడదు.
4. క్రమం తప్పకుండా యోగా చేసే వారికి అనారోగ్యం వస్తే వాళ్లు ఆ సమయంలో యోగా చేయకూడదు. ఎందుకంటే ఆ సమయంలో శరీరం బలహీనంగా ఉంటుంది .వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే యోగా చేయాలి.
కాబట్టి యోగసాధన చేసేవారు ఇటువంటి జాగ్రత్తలు పాటించి యోగాసనం యొక్క ఫలితాలను పొందండి.
గమనిక: యోగా ఎప్పుడూ సొంతగాచేయకూడదు .యోగా గురువు ఆధ్వర్యంలో లేదా నిపుణుల సలహా తీసుకుని చేయాలి.