Hydra Facial : హైడ్రా ఫేషియల్ తో రెట్టింపు సౌందర్యం మీ సొంతం..మరి తీసుకునే జాగ్రత్తల సంగతి ఏంటి? 

Telugu mirror : గతంలో మహిళలు తమ అందాన్ని మరింత పెంచుకోవడం కోసం ఇంటి చిట్కాలు పాటించేవారు .ఆ రోజులలో వీటిని అనుసరించి తమ చర్మాన్ని అందంగా మరియు కాంతివంతంగా మార్చుకునేవారు. అయితే ఇప్పుడు, కాలంతో పాటు పరిస్థితులు కూడా మారిపోయాయి. చర్మాన్ని సంరక్షించే పద్ధతి కూడా మారిపోయింది. ఇప్పుడు చాలామంది తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్(Beauty Products) ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్(Trend) లో హైడ్రా ఫేషియల్ ఒకటి. ఎందుకంటే హైడ్రా ఫేషియల్ చేయించుకుంటే వారి చర్మం చాలా బాగా కాంతివంతంగా మారుతుంది.

Tea Effect on children : మీ పిల్లలు ‘టీ’ తాగుతున్నారా? అయితే ఈ సంఘటన గురించి మీకు తెలియాల్సిందే..

నిర్జీవంగా ఉన్న చర్మాన్ని మళ్లీ మెరిసేలా చేసే అనేక అంశాలు దీనిలో ఉన్నాయి.అయితే కొన్నిసార్లు ఇటువంటి ఫేషియల్ ప్రజలకు ప్రమాదకరమని మీకు తెలుసా? ఇది వినడానికి భయంగా అనిపించిన ఇది వాస్తవమే. ఎందుకంటే చాలామందికి చర్మం సున్నితంగా ఉంటుంది. అందువలన హైడ్రా ఫేషియల్(Hydra Facial) అందరికీ సెట్ అవ్వదు. ఒకవేళ మీరు హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలనుకుంటే దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా అవసరం.హైడ్రా ఫేషియల్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Image Credit : Artimedica

ఈ హైడ్రా ఫేషియల్ చర్మాన్ని హైడైడ్ చేస్తుంది. ఈ ఫేషియల్లో బ్యూటీ డివైజ్ ను ఉపయోగించి చర్మం లోని అనగా మీ ముఖం లోని మృత కణాలను తొలగిస్తారు. ఇటువంటి ఫేషియల్ డ్రై స్కిన్ ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఒక్కొక్కరి చర్మ రకం విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మీరు హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే ముందుగా మీరు స్కిన్ డాక్టర్ లేదా మంచి అనుభవం ఉన్న బ్యూటిషన్ ను సంప్రదించాలి .ఆ తర్వాత మీ చర్మానికి సరిపోయే దాన్ని ఎంచుకోండి.

హైడ్రా ఫేషియల్ చేయించాలి అనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి:

  • ఎండలో నుంచి రాగానే ఈ హైడ్రా ఫేషియల్ చేయించకూడదు. కఠినమైన ఎక్స్ ఫోలియేట్(Ex foliate) లు మరియు రెటీనాల్ కి సంబంధించిన ఉత్పత్తులు వాడిన తర్వాత వెంటనే దీనిని చేయించకూడదు.
  • హైడ్రాఫేషియల్ చేయించుకున్న తర్వాత మీరు మీ బ్యూటిషన్ చెప్పిన సలహాలు అన్ని పాటించండి సున్నితమైన క్లెన్సర్, మాయిశ్చరైసర్ మరియు సన్ స్క్రీన్(Sun Screen) ని ఉపయోగించాలని నిర్ధారణ చేసుకోండి.
  • తర్వాత ఎండలోకి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి.సూర్యుని యొక్క బలమైన కాంతి కిరణాలు వలన మీ చర్మంపై చెడు ప్రభావం చూపుతుంది.
  • హైడ్రా ఫేషియల్ తర్వాత వెంటనే ఎక్కువ మేకప్(Make up) వేయకండి. దీని వలన మీ చర్మానికి హాని కలుగుతుంది.

ఇటువంటి కొన్ని జాగ్రత్తలతో పాటు మీ చర్మ తత్వాన్ని బట్టి ఇటువంటి ఫేషియల్ గురించి పూర్తిగా తెలుసుకొని , నిపుణుల సలహా తీసుకొని పాటించండి. తద్వారా మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోండి.

Leave A Reply

Your email address will not be published.