నిద్రపోతున్న సమయంలో ఒక్కోసారి అకస్మాత్తుగా దగ్గు వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎన్ని నీళ్లు తాగిన మళ్లీ మళ్లీ వస్తూ ఉంటుంది. అసలు ఆగదు. వస్తూనే ఉంటుంది. దీన్నే పొడి దగ్గు (dry cough)అంటారు.
ప్రస్తుతం వాతావరణంలో మార్పుల వల్ల కూడా పొడి దగ్గు అనేది వస్తూ ఉంటుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు. మందులు అధికంగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అయితే ఈ పొడి దగ్గును తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి పొడి దగ్గును తగ్గించుకోవచ్చు.
ఈరోజు కథనంలో పొడి దగ్గును తగ్గించుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.
శొంఠి :
అల్లం (ginger) ను పొట్టు తీసి పాలల్లో ఉడికించి ఎండబెట్టడం వల్ల శొంఠిలా మారుతుంది. బాగా ఎండిన తర్వాత దీనిని పొడి చేయాలి. లేదా మార్కెట్లో శొంఠిలభిస్తుంది. అదైనా వాడవచ్చు. ఈ శొంటి పొడిలో కొద్దిగా యాలుకలపొడి, ఒక టీ స్పూన్ తేనె కలిపి తినాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేసినట్లయితే పొడి దగ్గు తగ్గుతుంది.
అల్లం రసం, నిమ్మరసం, మిరియాల పొడి :
అర టీ స్పూన్ అల్లం రసం, మరియు అర టీ స్పూన్ నిమ్మరసం, పావు టీ స్పూన్ మిరియాల పొడి (Pepper powder) వేసి కలిపి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
మిరియాలు, దాల్చిన చెక్క, నెయ్యి :
నెయ్యి (ghee) లో నాలుగు మిరియాలు, ఐదు దాల్చిన చెక్క (Cinnamon) ముక్కలు వేసి దోరగా వేయించాలి. వేయించిన తర్వాత పొడి చేయాలి. ఈ పొడిని ఒక తమలపాకు (betel leaf) లో పెట్టి తినడం వలన దగ్గు తగ్గిపోతుంది. ఈ విధంగా తినలేని వారు కొద్దిగా తేనెను కూడా కలుపుకొని తినవచ్చు.
కాబట్టి నిద్రలో అకస్మాత్తుగా వచ్చే పొడి దగ్గును వదిలించుకోవడానికి ఇటువంటి కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించినట్లయితే, పొడి దగ్గును వదిలించుకోవచ్చు.