Telugu Mirror: పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటాయని పరిగణించబడతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు తప్పనిసరిగా పాలకు సంబంధించిన పదార్థాలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పాలు, పెరుగు, జున్ను వంటి పదార్థాలలో క్యాల్షియం (calcium) మరియు ప్రోటీన్ (protein) తో పాటు దేహానికి అవసరమైన అనేక రకాల మూలకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ పాల ఉత్పత్తుల ద్వారా వచ్చేది వెన్న. ఈ వెన్న(Butter) తీసుకోవడం అనేది ఆరోగ్యానికి ఉపయోగకరమా లేదా హానికరమా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది.
వెన్నలో క్యాలరీలు అధికంగా ఉన్నాయని అందుకే దీనిని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిని మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తుంది. కానీ దీనిని అధికంగా తీసుకున్నట్లయితే అనేక రకాల ఆరోగ్య సమస్యలను పెంచేలా చేస్తుంది.
వెన్నను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అలాగే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందా? అనే విషయం గురించి తెలుసుకుందాం.
రోజు వెన్న తిన్న లేదా అధిక పరిమాణంలో వెన్న తిన్నట్లయితే బరువు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణం వెన్నలో క్యాలరీ (Calories) లు అధికంగా ఉండడం. రోజువారి ఆహారంలో క్యాలరీలను అధిక మొత్తంలో తీసుకుని వాటిని ఖర్చు చేయకపోతే ఖచ్చితంగా బరువు పెరుగుతారని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి బరువు తగ్గాలని అనుకున్నవారు ఆహారంలో వెన్న తీసుకోవడం తగ్గించాలి.
Also Read: Eating Too much Sweets : అధికంగా తీపి పదార్ధాలు తింటున్నారా? అయితే ఈ చేదు నిజాలు మీ కోసమే.
వెన్నలో ఎక్కువ క్యాలరీలతో పాటు సంతృప్త కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం శరీరానికి చాలా ప్రమాదం అని నిపుణులు అంటున్నారు. రెండు టేబుల్ స్పూన్ల వెన్నలో 14 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది. దీనిని ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి అనేక విధాలుగా నష్టం కలిగిస్తుంది. అధిక మోతాదులో వెన్న తీసుకోవడం వల్ల మీ శరీరంలో విసెరల్ కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పెంచేలా చేస్తుంది.
కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ (Cholestrol) మొత్తాన్ని కూడా అధికం చేస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అధికంగా సంతృప్త కొవ్వు తీసుకోవడం వల్ల రక్తంలో ఎల్ డి ఎల్ (లో డెన్సిటీ లిపో ప్రోటీన్) కొలెస్ట్రాల్ పరిమాణాన్ని పెంచేలా చేస్తుంది. రక్తంలో ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే గుండెజబ్బులతో పాటు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
కాబట్టి వెన్న ఉన్న పదార్థాలను అధిక పరిమాణంలో తీసుకోకూడదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.