EGGS : మితంగా తీసుకుంటే ఆరోగ్యం, మితిమీరితే అనారోగ్యం. పోషక నిలయం గుడ్డు లో మంచి,చెడు

EGGS : Health in moderation, sickness in excess. Good and bad in Nutrient Egg
Image Credit : Martha Stewart

ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంభించటానికి ప్రతిరోజు రెండు గుడ్లు (Eggs) ఉడికించి తినడం ఆరోగ్యానికి మంచిది. మన రోజువారి ఆహారంలో గుడ్డును తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైన భాగం గా చెప్పవచ్చు. ఎందుకనగా గుడ్డులో విటమిన్ -D మరియు ప్రోటీన్ తో పాటు అనేక రకాల ముఖ్యమైన పోషకాలకు మంచి నిలయం గుడ్లు.

గుడ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నప్పటికీ, అనారోగ్య (sick) సమస్యలతో ఇబ్బంది పడేవారు మాత్రం తక్కువగా తినాలని వైద్యులు చెబుతున్నారు. లేదంటే వేరే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

నిజానికి ప్రతిరోజు మోతాదుకు మించి గుడ్లను తీసుకోవడం వలన శరీర బరువు పెరుగుతుంది. తద్వారా గుండె జబ్బుల (Heart disease) ప్రమాదాన్ని కూడా సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి గుడ్లను అతిగా తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read : Papaya : మీకు తెలుసా? బొప్పాయి పండు తిన్న తరువాత అస్సలు తినకూడని పదార్ధాలు

బరువును నియంత్రణలో ఉంచుకోవాలి అనుకునేవారు మరియు గుండెకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడేవారు గుడ్లను తీసుకోవడంలో తప్పనిసరిగా జాగ్రత్తలు (Precautions) తీసుకోవాలి. గుడ్లను అధికంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం కూడా ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

EGGS : Health in moderation, sickness in excess. Good and bad in Nutrient Egg
Image Credit : Daily Express

కాబట్టి ప్రతి వ్యక్తి ఆహారం తీసుకునే అవసరం భిన్నంగా (differently) ఉండవచ్చు. కానీ గుడ్లను అధిక మొత్తంలో తీసుకునేవారు పోషకాహార నిపుణుల సలహా లేదా వైద్యులను సంప్రదించి తీసుకోవాలి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎప్పటికప్పుడు గుడ్లు మోతాదు (dosage) ని తగ్గించాలని సూచిస్తున్నారు.

Also Read : world Heart Day : మీ హృదయం మీ చేతిలోనే పదిలం. సక్రమమైన జీవన శైలితోనే అది సాధ్యం

గుడ్లకు బదులుగా ఆహారంలో ప్రోటీన్ ఉన్న ఇతర ఆహార పదార్థాలను భాగంగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. అయితే వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను బట్టి వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. శరీరానికి ప్రోటీన్ (Protein) మరియు విటమిన్ -D ఎంత అవసరమో దానికి అనుగుణంగా గుడ్లను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతిరోజు రెండు ఉడికించిన గుడ్లను తినవచ్చు. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి వారి సలహాలు తప్పకుండా పాటించాలి.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in