Effects of Tea : ‘టీ’ వల్ల వచ్చే దుష్ప్రయోజనాలు మరియు నియంత్రణకై నిపుణుల మాటలు.

Telugu Mirror : భారతీయుల్లో “టీ”(Tea) ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.చాల మందికి “టీ” ప్రియమైన పానీయం. ‘టీ’ పై అతి ప్రేమ చూపించే వారు కచ్చితంగా నిపుణుల మాటలను వినాలి.చాల మంది ప్రజలు ఒక్క కప్ టీ లేకుండా ఒక్క రోజు కూడా గడపడానికి ఇష్టపడరు. రోజు మొదలవ్వాలి అంటే ముందు టీ గాని చాయ్ గాని తాగడం ఒక సాధారణ పద్ధతి. అప్పుడప్పుడు ఒక కప్పు టీని ఆస్వాదించడం హానికరం కానప్పటికీ, అధికంగా టీ తీసుకోవడం దీర్ఘకాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

అటువంటి సమయం లో ఆహారపు అలవాట్ల(habit)లో టీ ని తొలగించడం తెలివైన పనేనా ?ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే శారీరకంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవడానికి మేము నిపుణులను సంప్రదించాము.
దిన చర్యలో టీ వాడకం లేకపోతే ఎలా ఉంటుంది అనే విషయం పై ముంబైలోని పోవాయ్‌లోని డాక్టర్. ఎల్.హెచ్. హీరానందానీ హాస్పిటల్‌లోని చీఫ్ డైటీషియన్ రిచా ఆనంద్ ఇలా చెప్పారు.

Varalakshmi Vratam: ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి ఆచరించే వరలక్ష్మీ వ్రతం, సనాతన ధర్మ సాంప్రదాయం.

ఒక నెలపాటు టీ కి దూరంగా ఉండటం వల్ల శరీరంపై సానుకూల ఆరోగ్య ప్రభావాలు ఉండవచ్చని , అధిక ఒత్తిడి లేకుండా మరియు ఆందోళనకు గురికాకూండా , తక్కువ కెఫిన్(Caffeine) తగ్గడం వల్ల ఆరోగ్య విషయం లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయని వెల్లడించారు. అదనంగా, అధిక టీ వినియోగం మితమైన మూత్రవిసర్జన(urination) ప్రభావాలను కలిగిస్తుందని, అందువల్ల టీని వదిలివేయడం నిర్జలీకరణానికి సంబంధించిన ఇబ్బందులతో సహాయపడుతుంది అని చెప్పారు.

Image Credit : The conversation

అదేమరిదిరిగా , పూణేలోని రూబీ హాల్ క్లినిక్‌లో పోషకాహార నిపుణుడు మరియు చీఫ్ డైటీషియన్ అయిన డాక్టర్ కమల్ పాలియా చెప్పినది ఏంటంటే, టీ తాగడం వల్ల ఫ్రీ రాడికల్స్ తగ్గి సెల్యూలర్(Cellular) ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అతి ప్రమాదంగా చెప్పుకునే కాన్సర్ మరియు ప్రేగుకి సంబందించిన వ్యాధుల నుండి రక్షింపబడుతుంది.కొంత మందికి టీ తాగడం వల్ల ఓపికను , ఓదార్పుని ఇంకా విశ్రాంతి భావన కలిగించినప్పటికీ, అకస్మాత్తుగా టీ మానేస్తే అసంతృప్తి భావన మరియు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని Dr. ఆనంద్ పేర్కొన్నారు.

i Thrive న్యూట్రిషనిస్ట్ , CEO ఇంకా ఫౌండర్ ముగ్దా ప్రధాన్(Mugda Pradhan) ప్రకారం, క్రమం తప్పకుండా టీ తాగేవారు టీ తాగడం మానేయడం వల్ల కెఫిన్ తగ్గడం లో సహాయపడి మీకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. వ్యక్తి వ్యక్తికి కాల పరిమాణం మరియు అది చూపించే తీవ్రత మారుతుందని చెప్పారు. టీ అలవాటు ఉండి మానేస్తే తల పట్టడం , తలనొప్పి , ఏ పని మీద శ్రద్ధ చూపించకపోవడం, అలసిపోయిన భావన లాంటివి రావడం సర్వ సాధారణం. కావున , శరీరం తక్కువ కెఫిన్ స్థాయిలకు సర్దుబాటు చేసే వరకు తరచుగా కొన్ని రోజులు ఇలా ఉంటుందని ఆమె స్పష్టత ఇచ్చింది.

Chandhrayaan 3: విజయవంతంగా జాబిల్లిని ముద్దాడిన ‘ల్యాండర్ విక్రమ్’, నింగికెక్కిన భారత్

టీ మానేసే ఆలోచన..

టీ మానేయాలనే ఉద్దేశంతో ఉంటే Dr.పాలియా కొన్ని చిట్కాలను అందించారు. అవేంటో ఒకసారి చూద్దాం.

ఆరోగ్యానికి ప్రయోజనాలు మరియు మంచి రుచిని ఇచ్చే మూలికా కషాయాలు అనగా చమోమిలే లేదా పిప్పరమెంటు లాంటివి కెఫిన్ – రహితగా ఎంపిక చేసుకోండి.మిమ్మల్ని మీరు అలసట వదిలి రిఫ్రెష్(refresh) గా చేసుకునేందుకు పండ్ల రసాలను ముఖ్యంగా యాపిల్ మరియు క్రాన్‌బెర్రీ లాంటివి తీసుకోండి.వీటిలో కెఫిన్ ఉండదు . దీనికి తోడుగా గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ మరియు తేనెను కలిపి తాగడం వల్ల శరీరం హాయిని మరియు వెచ్చదనాన్ని కలిస్తుంది అని ,ఆమె అభిప్రాయపడ్డారు.

గమనిక : మీ యొక్క ప్రయోజనాలు ఉత్తమంగా ఉండాలని ఆశిస్తే ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి. మరిన్ని ఫలితాలను పొందండి.

Leave A Reply

Your email address will not be published.