Long hair growth: పొడవాటి శిరోజాల కోసం ఈ సహజ పద్దతులు పాటించండి

Telugu Mirror: నేటి కాలంలో ఆరోగ్యం మరియు అందం విషయంలో చాలామంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు‌ తాము అందంగా ఉండడం కోసం రకరకాల ప్రోడక్ట్స్ ని వాడుతుంటారు. కొంతమంది ఇంటి చిట్కాలను పాటిస్తారు. మరి కొంతమంది ట్రెండ్ కు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్(Artificial Products)ను వాడుతుంటారు. ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు ఎక్కువగా హెయిర్ ఎక్స్టెన్షన్ చేసే ట్రెండ్ చాలా ఎక్కువ అయింది .

వాస్తవానికి ప్రతి ఒక్కరు సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించవచ్చు. దీనివల్ల జుట్టు పొడవుగా కూడా పెరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవన శైలిలో అస్తవ్యస్తమైన మార్పుల వల్ల జుట్టు రాలిపోయే సమస్యను అధికంగా చూస్తున్నాం. దీనివల్ల జుట్టు పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది మహిళలలు తమ జుట్టు పొడవుగా ఉండాలని కోరుకుంటారు. మరి కొంతమందికి జుట్టు పొడవుగానే ఉంటుంది. అటువంటివారు ఆ పొడవైన జుట్టును అలానే కో మైంటైన్ చేయాలంటే అలాగే కొత్తగా పొడవైన జుట్టు వచ్చేవారికి మేము కొన్ని జాగ్రత్తలు చెప్పబోతున్నాం. వాటిని అనుసరించడం ద్వారా మీ పొడవైన జుట్టు ఎక్కువకాలం ఉంటుంది. జుట్టు పొడవుగా ఉండాలంటే ప్రత్యేక శ్రద్ధ తప్పకుండా తీసుకోవాలి.

Hair loss control in natural ways
Image Credit: CRLab
Also Read:Rainy Season Hair Tips: వర్షాకాలం లో కేశ సంరక్షణ

1. తల స్నానం చేసే సమయంలో షాంపూను పెట్టిన తర్వాత గట్టిగా రుద్దకూడదు అని గుర్తుంచుకోవాలి. జుట్టును సున్నితంగా రుద్దుతూ నీటితో కడగాలి. తలలో షాంపూ పూర్తిగా పోయేవరకు జుట్టుని ఎక్కువ నీటితో శుభ్రంగా కడగండి.

2. కండిషనర్(conditioner)ను ఉపయోగించకండి. ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్య వస్తుంది. పొడవైన జుట్టు ఎక్కువ రోజులు ఉండాలంటే మీ జుట్టుకు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి.

3. మీ జుట్టును దువ్వేటప్పుడు చాలా జాగ్రత్తగా దువ్వండి. దువ్వెన పళ్లకు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండే దువ్వెనను ఎంచుకోండి. దువ్వెనతో నిదానంగా మరియు జాగ్రత్తగా దువ్వండి. వేగంగా దువ్వడం వలన మీ జుట్టు చిక్కులు పడి ఎక్కువ రాలిపోయే అవకాశం ఉంటుంది.

4. పొడవైన జుట్టు ఉన్నవారు మరియు కొత్తగా పొడవైన జుట్టు వచ్చేవారు మెషన్లకు దూరంగా ఉండండి. అమ్మాయిలు హెయిర్ స్టైల్(Hair Style)చేయడానికి మిషన్లు ఉపయోగిస్తారు. హెయిర్ ని కర్లింగ్ చేయడం కోసం మరియు హెయిర్ ని స్ట్రైట్నర్లు ను చేయించడానికి మెషిన్ వాడతారు. ఇలా చేయడం వలన మెషిన్ లు మీ పొడవు జుట్టును దెబ్బతీస్తాయి.

కాబట్టి పొడవైన జుట్టు ఉన్నవారు మరియు కొత్తగా పొడవైన జుట్టు వచ్చేవారు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ జుట్టు పొడవును ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.