Precautions for hair colour : దీర్ఘకాల నల్లని జుట్టు కోసం..తప్పని సరి జాగ్రత్తలు మీ కోసం..

Telugu Mirror : ప్రతి ఒక్కరు తమ జుట్టు నల్లగా ఒత్తుగా బలంగా మరియు నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటారు ప్రస్తుత కాలంలో జీవన విధానంలో మరియు ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల చిన్న వయసు నుండే జుట్టు రాలడం మొదలవుతుంది దీనితో పాటుగా మరి కొంతమందికి చిన్న వయసు నుండి తెల్ల జుట్టు సమస్య(hair Problem) కూడా వస్తుంది. తెల్ల జుట్టును నల్లబరుచుకోవడం కోసం కొంతమంది తప్పని పరిస్థితులలో జుట్టుకి రంగు వేస్తుంటారు. జుట్టుకి రంగు నలుపు మాత్రమే కాకుండా వివిధ రకాల రంగులు వేసుకునే ట్రెండ్ కూడా నడుస్తుంది.

Magnesium Deficiency: మెగ్నీషియం లోపంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి.. మరి తినాల్సిన ఆహరం ఏంటి?

ప్రతిసారి పార్లర్ కి వెళ్లి హెయిర్ కలర్(Hair Colour) చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి చాలామంది ఇంట్లోనే తమ జుట్టుకు రంగు వేసుకుంటారు. అయితే ఇంట్లో రంగు వేసుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి లేదంటే మీ జుట్టు నిర్జీవంగా మారే అవకాశం ఉంది .కాబట్టి ఇవ్వాళ మీకు ఇంట్లోనే హెయిర్ కు కలర్ చేసుకునే వాళ్ళ కోసం జాగ్రత్తలు చెప్పబోతున్నాం. తద్వారా మీ జుట్టు యొక్క రంగు ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీ జుట్టుకి డామేజ్(hair damage) అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం.

Image Credit : WHYY
  • మీరు కొన్నటువంటి హెయిర్ డై ప్యాకెట్ యొక్క కవర్ పైన ఏమి రాసి ఉందో జాగ్రత్తగా చదవండి. వారి సూచనలను పాటించండి.
  • ఇంట్లోనే మీ జుట్టుకు రంగు వేయాలి అనుకున్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి. ఇలా చేయడం వలన హెయిర్ డై(hair dye) వలన మీకు ఎలర్జీ ఉందో లేదో తెలుస్తుంది. ప్యాచ్ టెస్ట్ కోసం మీరు రంగును చెవి వెనుక లేదా చేతి మణికట్టుపై కొద్దిగా రాయండి. ఆరిన తర్వాత రంగుని కడగండి. టెస్ట్ చేసిన తర్వాత 24 గంటలు వేచి చూడండి. ఎటువంటి ఎలర్జీ, వాపు ఇతర ఇబ్బందులు ఏమైనాఉంటే ఆ హెయిర్ డై ను వాడకండి.

Curd Benefits: పెరుగు వల్ల ఉపయోగాలు తెలిస్తే ఇక అది తినకుండా ఉండలేరు.

  • మార్కెట్ నుండి తెచ్చిన హెయిర్ కలర్ ప్యాకెట్ పైన రంగుని తలకి అప్లై చేసిన తర్వాత ఎంత సమయం ఉంచాలో అక్కడ రాసి ఉంటుంది. అంత సమయం వరకు మాత్రమే రంగును తలపై ఉంచండి. లేదంటే ఎక్కువ సమయం తల మీద డై ఉండడం వలన నీ జుట్టు నిర్జీవంగా మారుతుందని గుర్తుంచుకోండి.
  • రంగు వేసాక జుట్టుని వేడి నీటితో కడగవద్దు. ఎందుకంటే వేడి నీళ్లతో కడగటం వలన రంగు లైట్ కలర్ లోకి వస్తుందని గమనించండి.
  • జుట్టుకు రంగు వేసిన తర్వాత సాధారణ నీటితో కడగండి. ఒకటి లేదా రెండు రోజుల తర్వాత షాంపూ పెట్టి తల స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టులో ఉండే సహజ నూనెలు మరియు సెబమ్ స్కాల్ల్ఫ్ పై రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇది మీ తలపై వచ్చే అనేక ఇబ్బందులను తొలగిస్తుంది.

కాబట్టి జుట్టుకి కలర్ వేసుకునే వాళ్ళు ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మీ జుట్టు డామేజ్ అవ్వకుండా ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.