Health Tips : స్వంతంగా టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? ముఖ్యంగా పారాసెటమాల్ అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే  

Health Tips: Taking tablets yourself? Especially if it's paracetamol you're in danger
Image Credit : Arab News

శరీరంలో రోగనిరోధక శక్తి (Immunity) బలహీనంగా మారినప్పుడు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సీజన్ మారినప్పుడల్లా జ్వరం, జలుబు, దగ్గు వంటివి రావడం సహజం. ఇలా జ్వరం రాగానే చాలామంది పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలకు కూడా వేస్తుంటారు.

పారాసెటమాల్  టాబ్లెట్ జ్వరాన్ని మాత్రమే కాకుండా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి వాటిని కూడా కొద్దిగా తగ్గేలా చేస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్లినా ఇవే టాబ్లెట్స్ ఇస్తారు అన్న ఉద్దేశంతో చాలామంది సొంతం (Own) గా ఇంటి దగ్గరే ఇటువంటి టాబ్లెట్స్ కొని వేసుకుంటారు.

అయితే డాక్టర్ ను సంప్రదించకుండా, ఎంత డోసేజ్ అనేది తెలియకుండా పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.దీనివల్ల శరీరంలోని అవయవాల (organs) పై చెడు ప్రభావం పడుతుంది అని వైద్యులు చెబుతున్నారు.

పారాసెటమాల్ టాబ్లెట్స్ అధికంగా వేసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

రక్తహీనత :

పారాసెటమాల్ టాబ్లెట్స్ అధికంగా వేసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలు (Red blood cells) ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల (anemia) సమస్య మొదలవుతుంది. అంతేకాకుండా బలహీనంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాలేయం దెబ్బతింటుంది :

చాలామంది పారాసెటమాల్ టాబ్లెట్ మాత్రమే కాకుండా ఇంకా వేరే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినట్లయితే డాక్టర్ని సంప్రదించకుండా సొంతంగా టాబ్లెట్లు కొన్ని వేసుకుంటూ ఉంటారు. మరికొందరు పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడుతుంటారు.

Also Read : Dry Cough : పొడి దగ్గు మిమ్మల్ని వేధిస్తుందా? ఇలా చేసి చూడండి, పొడి దగ్గు మాయం మీకు ఉపశమనం..

Muscle Cramps In Sleep : నిద్రలో కండరాలు లేదా పిక్కలు పట్టేస్తుంటే ఈ చిట్కాలు పాటించడం ద్వారా చక్కటి ఉపశమనం పొందండి

ఈ విధంగా చేయడం వల్ల కాలేయం పై చెడు ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలేయం దెబ్బ తినడం వల్ల కళ్ళు, చర్మం పసుపు రంగు (Yellow Color) లోకి మారిపోతాయి. మూత్రం (urine) కూడా పసుపు రంగులోకి మారుతుంది.
కాబట్టి సొంతగా టాబ్లెట్స్ కొని వేసుకునే ముందు జాగ్రత్తలు పాటించాలి.

ఎలర్జీ :

పారాసెటమాల్ టాబ్లెట్లను ఎక్కువగా వేసుకోవడం వలన కొందరికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. చర్మం పై దద్దుర్లు, దురద, శ్వాస (breathing) లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Health Tips: Taking tablets yourself? Especially if it's paracetamol you're in danger
image credit : YT, MFine Care

రక్తస్రావం:

పారాసెటమాల్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొంతమందికి తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. అంతేకాకుండా ఈ టాబ్లెట్లను ఆస్పిరిన్ వంటి ఇతర మందులతో కలిపి వేసుకుంటే, మూత్రం ద్వారా రక్తస్రావం (Bleeding) అయ్యే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది.

అంతేకాకుండా ఆకలి లేకపోవడం, చెమట ఎక్కువగా పట్టడం, వాంతులు, వికారం, తిమ్మిరి, పొత్తి కడుపు పై నొప్పిగా ఉండడం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి.

కాబట్టి వైద్యులను సంప్రదించకుండా అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు సొంతంగా ఎటువంటి టాబ్లెట్ లను వాడకూడదు. లేదంటే మరిన్ని అనారోగ్య సమస్యలు (Health problems)వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in