టాన్సిల్స్ (Tonsils) ఉన్నవారు ఈ కాలంలో ఎక్కువగా నొప్పి మరియు వాపు తో బాధపడుతుంటారు.చలికాలంలో టాన్సిల్స్ ఎక్కువగా ఇన్ఫెక్షన్ కు గురవుతాయి. ఇన్ఫెక్షన్ వల్ల గొంతులో వాపు మరియు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ నొప్పి వల్ల ఏదైనా తినాలన్నా, త్రాగాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. శీతాకాలంలో (winter) టాన్సిల్స్ ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో టాన్సిల్స్ ఉన్నవారికి ఇటువంటి ఇబ్బందులు రావడం సాధారణ విషయం.
టాన్సిల్స్ వల్ల నొప్పి (pain) తట్టుకోలేక కొందరు వైద్యుల దగ్గరికి వెళుతుంటారు. మరికొందరు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉపశమనం పొందుతారు.
టాబ్లెట్స్ అవసరం లేకుండానే ఇంటి నివారణలు పాటించడం వల్ల ఇంట్లోనే ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
టాన్సిల్స్ కోసం ఎటువంటి ఇంటి నివారణలు ఉన్నాయో తెలుసుకుందాం.
లవంగాలు :
లవంగాల (Cloves) లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి గొంతు నొప్పి మరియు టాన్సిల్స్ నొప్పిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. లవంగాలను నమిలినా లేదా నోట్లో పెట్టుకొని చప్పరించినా, టాన్సిల్స్ నొప్పి తగ్గడంతో పాటు వాటి పరిమాణం కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా నోటి దుర్వాసనతో బాధపడేవారు కూడా వీటిని తినడం వలన ఆ సమస్య తొలగిపోతుంది.
సాల్ట్ వాటర్ :
టాన్సిల్స్ తో బాధపడేవారు గోరువెచ్చగా ఉన్న ఉప్పు నీటిని పుక్కిలించడం వల్ల మంచి రిలీఫ్ కలుగుతుంది. టాన్సిల్స్ వల్ల కలిగే నొప్పి కూడా తగ్గుతుంది.
గొంతు నొప్పితో బాధపడేవారు కూడా ఉప్పు నీళ్లతో పుక్కిలించడం (gargling) వల్ల నొప్పి వాపు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
తులసి ఆకులు :
తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా సమస్యలకు తులసి ఆకుల (Basil leaves) తో చెక్ పెట్టవచ్చు.
టాన్సిల్స్ నొప్పితో బాధపడేవారు తులసి ఆకులను నమలడం వల్ల నొప్పి మరియు వాపు తగ్గుముఖం పడతాయి.
అంతేకాకుండా తులసి ఆకులతో చేసిన కషాయాన్ని త్రాగిన నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం కలుగుతుంది.
తేనె మరియు పసుపు పాలు :
తేనె మరియు పసుపులో యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. పాలు (milk) తాగడం వల్ల వెంటనే శక్తి లభిస్తుంది. పాలల్లో తేనె మరియు పసుపు వేసి కలుపుకొని త్రాగడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి టాబ్లెట్స్ అధికంగా వాడకుండా ఇటువంటి (Home Tips) ను పాటించి ఉపశమనం పొందవచ్చు.
గమనిక :
ఈ కథనం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడింది. పాఠకులకు జ్ఞానం మరియు అవగాహన పెంపొందించడానికి మాత్రమే. వీటిని అనుసరించే ముందు వైద్యులను సంప్రదించగలరు.