Telugu Mirror: మానవ శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వు కూడా అవసరం . శరీర ఆరోగ్యం కోసం అనేక రకాల విటమిన్లు(Vitamins) ఖనిజాలు ఇతర పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటుగా హెల్తీ ఫ్యాట్ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పరిమాణం పెరుగుతుంది. మన శరీరానికి కొవ్వు కూడా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కొవ్వులు రెండు రకాలు ఒకటి. ఆరోగ్యకరమైనవి రెండు. అనారోగ్యకరమైనవి . శరీరానికి గుడ్ ఫ్యాట్(Good Fat) అవసరం .ఇప్పుడు దీని ప్రయోజనాలు మరియు దాని అవసరం గురించి మనం తెలుసుకుందాం.
కొవ్వులు కూడా ఒక రకమైన పోషకాలు. ఎలా అంటే ఐరన్ మరియు ప్రోటీన్ లాగా మన శరీరానికి శక్తిని పొందడానికి, విటమిన్(Vitamin) మరియు గుండె(Heart), మెదడు(Brain) ఆరోగ్యానికి కాపాడుకోవడానికి, ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం.
Also Read:Foot care: వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మీ పాదాలను సంరక్షించుకోండిలా…
ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో ఒక భాగంగా చేర్చడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే గుండెజబ్బులు(Heart Diseases) వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలవు మరియు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి, శరీరంలో మంటను తగ్గించడంలో ఇవి ఎంతో తోడ్పడతాయని కనుగొన్నారు.
డైటరీ ఫ్యాట్ అనగా ఆరోగ్యకరమైన కొవ్వు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందని పరిశోధకులు అన్నారు. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం కూడా చూపుతుంది.
Also Read:Sukanya Samrudhi : కేవలం 250 రూపాయలతో డిపాజిట్, మీ చిన్నారి భవిష్యత్ కోసం అదిరిపోయే స్కీమ్
అందువల్ల ఆహారంలో మనం శాచ్యురేటెడ్ మరియు పాలి అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ఇవి గుండె సంబంధిత జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో అనేక పదార్థాలు ద్వారా సరఫరా చేయవచ్చు .కొవ్వు కలిగిన చేపలు సాల్మన్,మాకేరల్ మొదలైనవి ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్ లను కలిగి ఉంటాయి. అవకాడో(Avocado) లో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల గుండెజబ్బులకు ప్రయోజనకరంగా ఉంటుంది. గింజలు మరియు విత్తనాలు, ఆలివ్ నూనె(olive oil) ,బీన్స్(beans) వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
ఇటువంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన శరీరానికి హెల్తీ ఫ్యాట్ లను అందించవచ్చు.