Garlic Uses : రోజువారీ ఆహారంలో వెల్లుల్లి ప్రయోజనాలు.. తెలిస్తే వదిలి పెట్టరు..

Telugu Mirror : వెల్లుల్లి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మన దైనందిన ఆహారంలో వెల్లుల్లిని చేర్చడం వల్ల చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి. వెల్లుల్లి మన శరీరంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే వాటిలో కీలకమైనది.
వెల్లుల్లిని రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది .అలాగే కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది మరియు జలుబును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.అధిక ప్రయోజనాల కోసం మనం రోజువారి ఆహారంలో వెల్లుల్లిని ఎలా భాగం చేయాలో తెలుసుకుందాం.

పరగడుపున పచ్చి వెల్లుల్లి తీసుకోవడం వల్ల:

పరగడుపున వెల్లుల్లి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ రసాయన పదార్థం క్యాన్సర్ మరియు గుండె జబ్బులు నివారించడంలో మంచి ప్రతినిధిగా పనిచేస్తుంది. ఈ ఉపయోగాలను పొందాలంటే ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపున కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలను ఒక గ్లాసు నీటితో తీసుకోవాలి.

RBI Bonds : రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన.. డబ్బులు దాచుకునే వారికి అదిరిపోయే ఆఫర్..

వెల్లుల్లి నూనెను వాడటం:

వెల్లుల్లి నూనెను మనం రోజువారి డైట్ లో చేర్చడం కూడా మరొక మార్గం. వెల్లుల్లి ఆయిల్ సాధారణ వంటకాల్లో మరియు సలాడ్లలో ఉపయోగించవచ్చు. లేదా వెల్లుల్లి నూనెను కాల్చిన కూరగాయలపై కూడా చల్లుకోవచ్చు. ఈ వెల్లుల్లి ఆయిల్ చర్మానికి కూడా చాలా మంచిది. దీనిలో క్రిమి నాశిక యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ఉండడం వల్ల వివిధ రకాల చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడతాయి.

రోజువారి వంటకాలలో వెల్లుల్లి చేర్చడం:

రోజువారి ఆహారంలో వెల్లుల్లి చేర్చడం ద్వారా ,ఆహారానికి మసాలాను జోడించడం సులభం అవుతుంది.వెల్లుల్లి అన్ని రకాల కూరలు పప్పులు అలాగే సూప్ తో చక్కగా కలిసిపోతుంది. అయితే వండిన వెల్లుల్లి లో అల్లి సిన్ యొక్క పనితీరును తగ్గిస్తుందని గమనించాలి. కాబట్టి వెల్లుల్లి వంటలలో ఉపయోగించేటప్పుడు సన్నగా తరిగిన పచ్చి వెల్లుల్లి ముక్కలను చేర్చడం మంచిది. వెల్లుల్లి మరియు తేనె కలిపి తినడం:
మనం రోజువారి డైట్ లో వెల్లుల్లి మరియు తేనెను సులభంగా తీసుకోవచ్చు.

ఒక వెల్లుల్లి రెబ్బను మూడు లేదా నాలుగు ముక్కలుగా కట్ చేసి వాటిని ఒక చెంచా తేనెతో కలిపి తినాలి. ఘాటుగా అనిపిస్తే తిన్న వెంటనే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల ఘాటు ప్రభావం తగ్గుతుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతో వెల్లుల్లి -తేనే కలిపి తీసుకోవడం వల్ల ఫుల్ యాసిడ్ రిఫ్లెక్స్ మరియు రెగ్యురిటేషన్ యొక్క లక్షణాలను బలహీనపరచడంలో తోడ్పడుతుంది.

Sambar-Case : ఇది ఎక్కడి సాంబారు కేసు రా బాబు!

కాల్చిన వెల్లుల్లి:

కాల్చిన వెల్లుల్లి మంచి రుచిని కలిగి ఉంటుంది. వెల్లుల్లి కాల్చడం వలన పోషక ప్రయోజనాలను కోల్పోకుండా ఉంటుంది. కాల్చడం వలన వెల్లుల్లిలో పోషకాలు తగ్గవు కాల్చిన వెల్లుల్లిలో క్వెంఫ్సెరోల్ మరియు క్వెర్సెటిన్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రక్తం గడ్డ కట్టకుండా సహాయపడతాయి.రక్తప్రసరణను మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడుతుంది‌.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వెల్లుల్లి ని మనం రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడినది .పాఠకులకు జ్ఞానం మరియు అవగాహన పెంచడానికి సంబంధిత కథనం తయారు చేయబడింది.

Leave A Reply

Your email address will not be published.