Obesity : పిల్లల్లో అధికమవుతున్న ఊబకాయం, నిపుణుల మాటలతో నివారించే ప్రయత్నం.

Telugu Mirror : ఊబకాయం(Obesity) అనేది ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. దీని వలన ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. అధిక బరువు కలిగి ఉండటం వల్ల అనేక రకాల వ్యాధులు మరియు దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ శరీరం యొక్క బరువును నియంత్రణలో ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో కూడా ఊబకాయం పెరుగుతుందని దీనివల్ల వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైద్య నివేదికలలో దీనిని ఒక అంటు వ్యాధిగా కూడా వర్ణించబడింది. జంక్ ఫుడ్(Junk food) అధికంగా తీసుకోవడం, పోషకాహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, జీవన శైలిలో అస్తవ్యస్తమైన మార్పులు వీటి కారణంగా పిల్లల్లో ఉబకాయం సమస్య వేగంగా పెరుగుతుంది. పిల్లల్లో అధికమవుతున్న ఈ ఉబకాయ సమస్యను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో అనేక తీవ్రమైన మరియు దీర్ఘకాలిక సమస్యలకు కారణం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.పిల్లల్లో స్థూల కాయం వలన చిన్న వయసులోనే డయాబెటిస్(Diabetes), గుండె వ్యాధులు,కాలేయం వ్యాధులు వీటి బారిన పడి , ప్రాణాంతకంగా మారి, చెడు ప్రభావాలను కూడా చూపిస్తున్నాయి. మీ పిల్లల్లో ఎవరికైనా స్థూలకాయం సమస్యలు ఉంటే దానిని అదుపు చేసే ప్రయత్నం చేయాలి. దీనికోసం వైద్యుడుని సంప్రదించి వారు చెప్పిన విధంగా పాటించాలి.

Stones in Kidney : కిడ్నీలో రాళ్ల ఏర్పాటుకు కారణాలు మరియు జాగ్రత్తలు తెలుసుకోండి ఇలా ..

పిల్లల వైద్యుడు డాక్టర్ రుచిరా సేథ్ మాట్లాడుతూ, అధిక బరువు ఎవరికైనా ప్రమాదకరం. అయితే పిల్లలకు ఊబకాయం ఉంటే తీవ్రమైన దుష్ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతోపాటు చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతారని మరియు జీవిత నాణ్యతపై కూడా చెడు ప్రభావం చూపిస్తుందని అన్నారు.ప్రస్తుత కాలంలో ఊబకాయం అనే సమస్య అధికమవుతుంది. కనుక ఆహారంలో జంక్- ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం మరియు నిష్క్రియాత్మకత కారణాలు కావచ్చు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరమని అన్నారు. డాక్టర్ రుచిరా ఇంకా ఏమన్నారంటే, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్(fast food) శరీర బరువును అధికం చేయడమే కాకుండా లివర్ మరియు జీర్ణ వ్యవస్థ పై కూడా దుష్ప్రభావం కలిగిస్తాయని అన్నారు.

Image Credit : Enadu.net

Effects of Tea : ‘టీ’ వల్ల వచ్చే దుష్ప్రయోజనాలు మరియు నియంత్రణకై నిపుణుల మాటలు.

ఆహారంలో కూరగాయలను చేర్చడంతో పాటు, కొవ్వు శాతం తక్కువగా ఉన్న పాల పదార్థాలను మరియు త్రుణ ధాన్యాలను తప్పకుండా చేర్చాలి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను సులభంగా అందించడంలో తోడ్పడతాయి. పిల్లల్లో స్థూల కాయం రావడానికి కారణం అవుట్ డోర్ గేమ్స్ ఆడటం బాగా తగ్గిపోవడం. ఇప్పుడు పిల్లలు బయట ఆడడం కంటే ఫోన్ మరియు వీడియో గేమ్(Video game) లతో అధిక సమయం గడుపుతున్నారు. దీని వలన శారీరక శ్రమ లేకుండా అవుతుంది. అవుట్ డోర్ గేమ్స్ ఆడటం వల్ల శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది. కేలరీలు కూడా ఖర్చవుతాయి. దీనితోపాటు పిల్లలు ఫిట్ నెస్ గా కూడా ఉంటారు. కాబట్టి పిల్లలకు తగినంత శారీరక శ్రమ కూడా అవసరం. దీని ద్వారా కూడా ఊబకాయ సమస్యను నియంత్రించవచ్చు.

ఎక్కువసేపు మేల్కొని ఉండటం వలన కూడా ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. మరియు అధిక బరువు కూడా కారణమవుతుంది. మొబైల్ మరియు అనేక ఇతర రకాల స్క్రీన్ల లో గడపే సమయం అధికం అవ్వడం వలన పిల్లల నిద్ర చక్రంపై చెడు ప్రభావం పడుతుంది. దీని వలన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కు కారణం అవుతుంది. దీనివలన అనేక రకాల ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంది.

కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయం లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.వారు తీసుకునే ఆహారంలో శ్రద్ధతో పాటు, వారికి తగినంత శారీరక శ్రమ కూడా ఉండేలా చూసుకోవాలి. వీలైనంతవరకు జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్స్ కి అలాగే మొబైల్స్(Mobiles) వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి.

Leave A Reply

Your email address will not be published.