Inguva Benefits: ఆహారంలోకే కాదు..ఇంగువ..అతివల అందానికి కూడా..”ఇంగువ”ను వాడండి ఇలా..మెరిసి పొండి మిల మిలా..
Telugu Mirror: ఆహారం మరింత రుచికరంగా తయారవ్వడానికి మసాలా(masala) దినుసులు వాడుతుంటాం. వంటలలో తగు మోతాదులో సుగంధ ద్రవ్యాలు వేయడం వల్ల ఆ వంటకు రుచి పెరుగుతుంది. అయితే సుగంధ ద్రవ్యాలో ఇంగువ కూడా ఒకటి. పప్పు వంటకాలు,పచ్చళ్ళు మరియు ఇతర రకాల వంటలు వండేటప్పుడు ఇంగువ వేయడం వల్ల సువాసనతో పాటు రుచి కూడా పెరుగుతుంది. ఇంగువ అజీర్తికి బాగా ఉపయోగపడుతుంది . ఇంగువని కేవలం వంటల్లో మాత్రమే ఉపయోగిస్తారని అందరికీ తెలుసు. కానీ చర్మ సంబంధిత సమస్యలకు కూడా పని చేస్తుందని చాలామందికి తెలియదు. ఇంగువ ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మీకు విచిత్రంగా అనిపించినా కానీ ఇది వాస్తవమే. ఇంగువను ఉపయోగించడం ద్వారా మీరు మచ్చలు లేని మరియు నిగారింపు చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈరోజు మీకు మేము ఇంగువని ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేసే పద్ధతి మరియు ఎలా దాని వలన ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం. తద్వారా మీరు కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.
ఫేస్ ప్యాక్ తయారీ విధానం: దీనికి కావాల్సిన పదార్థాలు: రెండు స్పూన్ల -ముల్తానీ మిట్టి, ఒక స్పూన్- తేనె(Honey), ఒక స్పూన్ -రోజు వాటర్(Rose Water), ఇంగువ- చిటికెడు.
ఒక గిన్నెలో ఈ నాలుగు పదార్థాలు వేసి పేస్టులా కలపాలి. దీనిని ముఖంపై అప్లై చేయాలి. ఆరిన తర్వాత సాధారణ నీటితో కడగాలి. మీరు ప్రతిరోజు ఈ ఫేస్ ప్యాక్(Face Pack)ను వాడవచ్చు.
ఈ ప్యాక్ యొక్క ఉపయోగాలు గురించి తెలుసుకుందాం:
ఈ ప్యాక్ ను క్రమం తప్పకుండా వాడటం వల్ల ముఖం మీద ఉన్న మొటిమలు వాటి తాలూకు నల్ల మచ్చలు పోతాయి. అలాగే జిడ్డు చర్మం ఉన్న వారికి కూడా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా వాడడం వల్ల చర్మం లో మెరుపు వస్తుంది.
ఈ ప్యాక్ లో మనం ఇంగువని జత చేసాము దీనివల్ల చర్మవ్యాధుల నుండి ఇది సంరక్షిస్తుంది. అనగా ఇది ముఖం పై ఉన్న దురద సమస్యలు కూడా తగ్గిస్తుంది. ఈ ప్యాక్ లో తేనె కూడా ఉండటం వల్ల ముఖానికి తేమను అందిస్తుంది.
Also Read:Do’s and Dont’s in Yoga: యోగా చేయండి ఎల్లవేళలా..యోగాసనం ఒక దివ్య ఔషధం..యోగా చేయకూడని పదతులు
ఇంగువ చర్మంపై ఉన్న బ్యాక్టీరియా(Bacteria)ని నశింప చేస్తుంది. మీ ముఖం మీద ఉన్న మొటిమలను తొలగించడంతోపాటు ముఖంపై ఉన్న ఇన్ఫెక్షన్స్(infection)కు కారణమయ్యే క్రిములతో పోరాడే శక్తి ఇంగువలో ఉంది .ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉన్న మచ్చలను, మొటిమలను కూడా నివారిస్తుంది .
కాబట్టి ఇంగువను వంటలకు ఉపయోగించడంతోపాటు చర్మ సౌందర్యం కోసం కూడా వాడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఫేస్ ప్యాక్(Face Pack) తయారు చేసి వాడటం వలన మీ ముఖాన్ని మెరిసేలా చేసుకో వచ్చు.